రాష్ట్రంలోనూ గరీబ్‌ కల్యాణ్‌ బీమా

ABN , First Publish Date - 2020-04-01T08:05:21+05:30 IST

కరోనా బారిన పడిన వారికి సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన’ను రాష్ట్రంలోనూ అమలు చేయనున్నట్టు...

రాష్ట్రంలోనూ గరీబ్‌ కల్యాణ్‌ బీమా

అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడిన వారికి సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన’ను రాష్ట్రంలోనూ అమలు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద ఆరోగ్య కార్యకర్తలకు రూ.50 లక్షల బీమాను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా పేషంట్లకు సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు ప్రమాదవశాత్తు కొవిడ్‌-19 బారిన పడి మరణిస్తే ఈ బీమా వర్తిస్తుందన్నారు. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలే రాష్ట్రంలోనూ అమలవుతాయని పేర్కొన్నారు. ఈ పథకం కాల వ్యవధి 90 రోజులుగా నిర్ణయించారు.  

Updated Date - 2020-04-01T08:05:21+05:30 IST