ఈవ్‌టీజింగ్‌పై పోలీసుల విచారణ

ABN , First Publish Date - 2020-02-08T08:25:40+05:30 IST

ఈవ్‌టీజింగ్‌పై రౌతులపూడి జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థినులను అన్నవ రం పోలీసులు శుక్రవారం విచారణ చేశారు.

ఈవ్‌టీజింగ్‌పై పోలీసుల విచారణ

రౌతులపూడి: ఈవ్‌టీజింగ్‌పై రౌతులపూడి జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థినులను అన్నవ రం పోలీసులు శుక్రవారం విచారణ చేశారు. పాఠశాలకు వెళుతున్న విద్యార్థినులపై ఓ కాలనికి చెందిన కొందరు యువకులు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారు. బుధవారం కూడా ఈవ్‌టీ జింగ్‌కు పాల్పడ్డారు. దీంతో ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పాఠశాలకు వచ్చి విచారణ చేశారు. ఫిర్యాదుదారు డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా కొద్దికాలంగా ప్రతీ రోజు పాఠశాల సమయంలో యువకులు ఉదయం, సాయంత్రం బైకులపై వచ్చి విద్యార్థులను ఈవ్‌టీజింగ్‌ చేస్తున్నట్టు పలువురు చెబుతున్నారు.

Updated Date - 2020-02-08T08:25:40+05:30 IST