‘అధికారంలో ఉండే అర్హత లేదు’

ABN , First Publish Date - 2020-10-07T09:26:23+05:30 IST

మహిళలు, బాలికలకు భద్రత కల్పించలేని వారికి అధికారంలో ఉండే అర్హత లేదని మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ఐక్యవేదిక ధ్వజమెత్తింది...

‘అధికారంలో ఉండే అర్హత లేదు’

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు 6: మహిళలు, బాలికలకు భద్రత కల్పించలేని వారికి అధికారంలో ఉండే అర్హత లేదని మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ఐక్యవేదిక ధ్వజమెత్తింది. యూటీఎఫ్‌ హోంలో మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా, యూటీఎఫ్‌, జమాతే ఇస్లాం హింద్‌, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్‌, జేవీవీ, ఎస్‌ఎఫ్‌ఐ, సీఐటీయూ, కేవీపీఎస్‌, మహిళా సమాఖ్య ప్రతినిధులు తమ వాణి వినిపించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దఽళిత యువతిపై అత్యాచారం, ప్రభుత్వం దోషులను కాపాడటానికి చేస్తున్న ప్రయత్నాలపై చర్చించారు.  యోగి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మహిళలు, బాలికలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రజల నుంచి సంతకాల సేకరణ చేయాలని, ప్రధానమంత్రికి, హోంమంత్రికి ఈ మెయిల్స్‌ పంపాలని, ఈ నెల 12న మహిళల భద్రత కోరుతూ మానవహారం నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. సీహెచ్‌ రమణి, సోనీ, షెహనాజ్‌, సౌభాగ్యం, కాశిబాలయ్య, వర్మ, నాగు, బేబి, అహ్మద్‌, అరుణ రాజా, సూరిబాబు పాల్గొన్నారు. 

Read more