నేటి నుంచి నన్నయ సెట్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-11-25T05:35:43+05:30 IST

కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురంలోని అక్నూ ఎంఎస్‌ఎన్‌ క్యాంపస్‌లో బుధవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నన్నయ సెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు ప్రత్యేకాధికారి ఎస్‌.ప్రశాంతశ్రీ తెలిపారు.

నేటి నుంచి నన్నయ సెట్‌ కౌన్సెలింగ్‌

 సర్పవరం జంక్షన్‌, నవంబరు 24: కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురంలోని అక్నూ ఎంఎస్‌ఎన్‌ క్యాంపస్‌లో బుధవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నన్నయ సెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు ప్రత్యేకాధికారి ఎస్‌.ప్రశాంతశ్రీ తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లైఫ్‌సైన్స్‌స్‌, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఫిజికల్‌ సైన్స్‌, తెలుగు, జియాలజీ, 26 తేదీ ఉదయం కెమికల్‌ సైన్స్‌, మధ్యాహ్నం కెమికల్‌ సైన్స్‌, హిందీ, ఎంపీఈడీ, 27వ తేదీ ఉదయం హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఇంగ్లిషు, మధ్యాహ్నం మేథమెటికల్‌ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ప్రశాంత్రశీ కోరారు. 

 


Read more