అంబేడ్కర్‌ వర్ధంతిని అధికారికంగా జరపకపోవడం సిగ్గుచేటు: వనమాడి

ABN , First Publish Date - 2020-12-07T05:51:38+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), డిసెంబరు 6: అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపకపోవడం సిగ్గుచేటని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి

అంబేడ్కర్‌ వర్ధంతిని అధికారికంగా జరపకపోవడం సిగ్గుచేటు: వనమాడి
అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న వనమాడి, నాయకులు

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), డిసెంబరు 6: అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపకపోవడం సిగ్గుచేటని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం అంబేడ్కర్‌ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని పక్కనబెట్టి సీఎం జగన్‌ రూపొందించిన రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ దళిత నాయకుడు మోకా ఆనందసాగర్‌, నగర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సీకోటి అప్పలకొండ, నాయకులు పలివెల రవిఅనంతకుమార్‌, కొల్లాబత్తుల అప్పారావు, అంబటి చిన్నా, మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, తుమ్మల రమేష్‌, వొమ్మి బాలాజీ, చింతలపూడి రవి, చోడిపల్లి సతీష్‌, మూగురాజు, పైల రామకృష్ణ, చాపల ప్రశాంతి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-07T05:51:38+05:30 IST