రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-06T05:52:45+05:30 IST

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) ఆధ్వర్యంలో శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
మెడకు ఉరితాగు బిగించుకుని నిరసన తెలుపుతున్న దృశ్యం

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), డిసెంబరు 5: ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) ఆధ్వర్యంలో శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. గొడారిగుంట మూడు గుళ ్ల సెంటర్‌ పొటి ్టశ్రీరాములు విగ్రహం వద్ద మెడకు ఉరితాడు బిగించుకుని   నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.బాబి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని, రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తుంటే పోలీసులతో కొట్టించడం దారుణమని అన్నారు. అన్నం పెట్టే రైతన్న రోడ్డెక్కి వారం రోజులుగా నిరసన తెలుపుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఏఐవైఎఫ్‌ నాయకులు గోనెల నాగభూషణం, సూరంపూడి నాని, ఎం.రమేష్‌కిశోర్‌, డి.కోదండ,  కె బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు. 

  Read more