కరోనా సాయం దోపిడీ.. ఎక్కడో తెలుసా?

ABN , First Publish Date - 2020-04-08T02:03:21+05:30 IST

కరోనా వేళ సామాన్యులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఇస్తున్న సహాయాన్ని వైసీపీ పార్టీ వాళ్లు దారుణంగా దోచేస్తున్నారు...

కరోనా సాయం దోపిడీ.. ఎక్కడో తెలుసా?

విజయవాడ: కరోనా వేళ సామాన్యులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఇస్తున్న సహాయాన్ని వైసీపీ పార్టీ వాళ్లు దారుణంగా దోచేస్తున్నారు. అదేమిటని అడిగితే ఆడవారు అని కూడా చూడకుండా దాడులకు దిగుతున్నారని బెడవాడలో ఆందోళన మొదలైంది. అసలు విషయానికి వస్తే కరోనా సాయం కింద కేంద్రం ఇస్తున్న వెయ్యి రూపాయల సాయం కూడా విజయవాడలో రాజకీయానికి ముడిపెడుతున్నారు. జాబితాలో పేరు లేదనే సాకుతో వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో విజయవాడలోని చుట్టుగుంట ప్రాంతంలో మహిళలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారికి మద్దతుగా బైఠాయించారు. 


Read more