తెలంగాణలో జూరాల తప్ప ప్రాజెక్టులన్నీ అక్రమమే: బైరెడ్డి

ABN , First Publish Date - 2020-05-13T17:18:52+05:30 IST

తెలంగాణలో జూరాల తప్ప ప్రాజెక్టులన్నీ అక్రమమేనని ఏబీఎన్‌తో మాట్లాడిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.

తెలంగాణలో జూరాల తప్ప ప్రాజెక్టులన్నీ అక్రమమే: బైరెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో జూరాల తప్ప ప్రాజెక్టులన్నీ అక్రమమేనని ఏబీఎన్‌తో మాట్లాడిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ముచ్చుమర్రి, హంద్రీనీవా ప్రాజెక్టులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ‘‘జలదోపిడీ అంటూ తెలంగాణ నేతలు ఏడుస్తున్నారు. ఏ సీఎం ఉన్నా తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం చేశారు. పాలమూరు పథకం జీవో జారీ రోజే గుండ్రేవుల రిజర్వాయర్‌కు జీవో ఇచ్చారు. జగన్‌ ప్రభుత్వం గుండ్రేవులను వదిలేసి వివాదాలకు ఎందుకు తావిస్తున్నారు?. 10 రోజుల్లో 20 వేల క్యూసెక్కులను ఎలా తరలిస్తారో తెలియడం లేదు. అమరావతి, ఎస్‌ఈసీ అంశం.. జగన్‌ నిర్ణయాలన్నీ వివాదాస్పదమవుతున్నాయి. రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణం కూడా వివాదంలో చిక్కుకుంటాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లాలి. జగన్‌ నిర్ణయాలు రాజకీయ ప్రచారానికి మాత్రమే పనికి వస్తాయి. తను చేయాలనుకుంటే కేసీఆర్‌ అడ్డుకున్నారని జగన్‌ చెప్పుకుంటారు. ప్రాజెక్ట్‌లపై తెలంగాణ ప్రభుత్వాన్ని జగన్‌ ఒప్పించాలి. జూరాల ఎగువన ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి తెలంగాణ చర్యలు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 

Updated Date - 2020-05-13T17:18:52+05:30 IST