పేదలను మభ్యపెట్టిన జగన్‌: బొండా ఉమ

ABN , First Publish Date - 2020-03-24T09:25:44+05:30 IST

‘కోర్టు పరిధిలోని అమరావతి భూములను లక్ష మంది పేదలకు పంచుతామని ప్రభుత్వం మభ్యపెట్టింది. జీవో నంబరు 107 ద్వారా ...

పేదలను మభ్యపెట్టిన జగన్‌: బొండా ఉమ

విజయవాడ, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ‘‘కోర్టు పరిధిలోని అమరావతి భూములను లక్ష మంది పేదలకు పంచుతామని ప్రభుత్వం మభ్యపెట్టింది. జీవో నంబరు 107 ద్వారా కుట్రకు తెరదీసింది. దీంతో అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు చెప్పింది’’ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమ విమర్శించారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతి భూములను సీఆర్‌డీఏ ఒప్పందం ప్రకారమే చేయాలని, అమరావతి ప్రాంతంలోని పేదవాళ్లకు మాత్రమే ఇవ్వాలని హైకోర్టు చెప్పడం ప్రభుత్వానికి చెంపపెట్టు అని విమర్శించారు. టీడీపీ హయాంలో లక్షమంది పేదవాళ్లకు పక్కాఇళ్లు కట్టించాలని జక్కంపూడిలో భూమి కొనటానికి కేటాయించిన రూ.100 కోట్లను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని ఉమ విమర్శించారు. పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టించే వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు.

Read more