జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలని జగన్‌కు కన్నా లేఖ

ABN , First Publish Date - 2020-04-26T18:42:53+05:30 IST

జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలని జగన్‌కు కన్నా లేఖ

జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలని జగన్‌కు కన్నా లేఖ

అమరావతి: కరోనాపై రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. జర్నలిస్టులు ఫ్రంట్‌లైన్ సైనికులుగా పని చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. కోవిడ్19 మహమ్మారి సమయంలో రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులందరికీ రూ.10లక్షలు బీమా సౌకర్యం కల్పించడం ద్వారా హర్యానా ప్రభుత్వం  ముందుందని వెల్లడించారు. దురదృష్టవశాత్తు జర్నలిస్టులకు కూడా కరోనా బారిన పడుతున్నారని అన్నారు. జర్నలిస్టులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విధుల్లో ఉన్న మీడియా సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించాలని కన్నా లక్ష్మీనారాయణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-26T18:42:53+05:30 IST