మూగజీవాల సంగతేంటి..?

ABN , First Publish Date - 2020-04-01T08:04:24+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా అన్నార్తులైన పేదలకు స్వచ్ఛంద సంస్థలు, సహృదయులు ఆహారాన్ని సమకూరుస్తున్నారు. మరి మూగ జీవాల పరిస్థితి ఏమిటి? ఈ విషయంపైనే రెండు రోజుల క్రితం కేంద్రప్రభుత్వం...

మూగజీవాల సంగతేంటి..?

  • ఆహారం అందకపోతే కుక్కలకు రేబీస్‌

గుంటూరు (సంగడిగుంట), మార్చి 31: లాక్‌డౌన్‌ కారణంగా అన్నార్తులైన పేదలకు స్వచ్ఛంద సంస్థలు, సహృదయులు ఆహారాన్ని సమకూరుస్తున్నారు. మరి మూగ జీవాల పరిస్థితి ఏమిటి? ఈ విషయంపైనే రెండు రోజుల క్రితం కేంద్రప్రభుత్వం కూడా రాష్ర్టాలను అప్రమత్తం చేసింది. వీధి కుక్కలకు రెండు మూడు రోజుల పాటు ఆహారం అందకపోతే మానసిక స్ధితి కోల్పోతాయని, వాటికి రేబిస్‌ వ్యాధి సోకి పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ మనుషులపై దాడి చేసే అవకాశం ఉందని పేర్కొంది.


దీన్ని నివారించాలంటే ప్రభుత్వం లేదా స్వచ్చంద సంస్ధల సహకారంతో మూగ జీవాల ఆకలి కూడా తీర్చాలని కోరింది. ప్రభుత్వంతో పాటు జంతు సంరక్షణ సంఘాలు కూడా ఈ విషయంపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఇప్పటి వరకు వీధి కుక్కలు చికెన్‌ దుకాణాలు, ఫంక్షన్‌ హాళ్లు, హోటళ్ల వద్ద మిగిలిన ఆహారం తింటూ పొట్ట నింపుకొంటున్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇవేమి మనుగడలో లేవు. కాబట్టి ఆహారం, నీటి కొరతతో ప్రమాదం తలెత్తనుందని కేంద్రం హెచ్చరించింది.

Updated Date - 2020-04-01T08:04:24+05:30 IST