గ్రామాల పరిశుభ్రతకు సహకరించాలి - జడ్పీ సీఈఓ

ABN , First Publish Date - 2020-12-20T06:22:50+05:30 IST

గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని జడ్పీ సీఈఓ శోభా స్వరూపారాణి కోరారు.

గ్రామాల పరిశుభ్రతకు సహకరించాలి - జడ్పీ సీఈఓ
సమీక్షిస్తున్న జడ్పీ సీఈఓ శోభాస్వరూపారాణి


కణేకల్లు, డిసెంబరు 19: గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని జడ్పీ సీఈఓ శోభా స్వరూపారాణి కోరారు. ఈనెల 20న స్థానికంగా నిర్వహించనున్న ‘వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం’ ముగింపు కార్యక్రమ ఏర్పాట్లను శనివారం ఆమె పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి, ప్రతి పంచాయతీలో పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ క్రమంలో ప్రజలను  చైతన్యవంతులను చేస్తోందన్నారు. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో డీపీవో పార్వతి, ఎంపీడీవో విజయభాస్కర్‌, ఈవోఆర్డీ గూడెన్న, పంచాయతీ ఈవో చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T06:22:50+05:30 IST