మాదక ద్రవ్యాలతో నాడీ వ్యవస్థకు చేటు : డీఎస్పీ

ABN , First Publish Date - 2020-12-19T06:46:39+05:30 IST

మాదక ద్రవ్యాలను వాడడం వల్ల నేరుగా మెదడు, కేంద్ర నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని డీఎస్పీ వీఎనకే చైతన్య తెలిపారు.

మాదక ద్రవ్యాలతో నాడీ వ్యవస్థకు చేటు : డీఎస్పీ
మాట్లాడుతున్న డీఎస్పీ వీఎనకే చైతన్య, వేదికపై సర్‌ సీవీ రామన విద్యాసంస్థల చైర్మన బీవీ భాస్కర్‌రెడ్డి, సీఐ తేజమూర్తితాడిపత్రి, డిసెంబరు1 8: మాదక ద్రవ్యాలను వాడడం వల్ల నేరుగా మెదడు, కేంద్ర నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని డీఎస్పీ వీఎనకే చైతన్య తెలిపారు. పట్టణంలోని సర్‌ సీవీ రామన డిగ్రీ కళాశాలలో శుక్రవారం మాదక ద్రవ్యాల నిరోధంపై సీవీ రామన విద్యాసంస్థల చైర్మన బీవీ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను వాడేకొద్దీ శరీరంలోని అన్ని వ్యవస్థలపై దుష్ప్రభావం చూపుతుందన్నారు. చివరికి ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడుతుందన్నారు. సీవీ రామన విద్యాసంస్థల చైర్మన భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వంటి వ్యసనాలకు విద్యార్థులు బానిసలు కాకుండా, క్రమశిక్షణతో మెల గాలన్నారు. ప్రతి విద్యార్థి అత్యుత్తమంగా చదివి మంచి ఉద్యోగ అవకాశాలను పెంపొందించుకొని బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అనంతరం డీఎస్పీ చై తన్యను చైర్మన బీవీ భాస్కర్‌రెడ్డి శాలువాకప్పి ఘనంగా సన్మానించారు. సదస్సులో పట్టణ సీఐ తేజమూర్తి, ఎస్‌ఐ ప్రదీప్‌, ప్రిన్సిపాల్‌ గణేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు. 

Read more