వైసీపీకి తెలుగుతల్లి శోకం తప్పదు

ABN , First Publish Date - 2020-12-19T06:30:33+05:30 IST

వైసీపీ ప్రభుత్వానికి తెలుగుతల్లి శో కం తప్పదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జేఏసీ గౌరవాధ్యక్షుడు ఉన్నం హ నుమంతరాయచౌదరి శాపనార్థాలు పెట్టారు. అమరావతి రైతులు చేపడుతున్న ఉద్యమానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం జేఏసీ కన్వీనర్‌ మోరేపల్లి మల్లికార్జున ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ, రాస్తారోకో, మానవహారం చేపట్టి మద్దతు తెలిపారు.

వైసీపీకి తెలుగుతల్లి శోకం తప్పదు
కళ్యాణదుర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ


రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా జేఏసీ భారీ ర్యాలీ

కళ్యాణదుర్గం, డిసెంబరు 18: వైసీపీ ప్రభుత్వానికి తెలుగుతల్లి శో కం తప్పదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జేఏసీ గౌరవాధ్యక్షుడు ఉన్నం హ నుమంతరాయచౌదరి శాపనార్థాలు పెట్టారు. అమరావతి రైతులు చేపడుతున్న ఉద్యమానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం జేఏసీ కన్వీనర్‌ మోరేపల్లి మల్లికార్జున ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ, రాస్తారోకో, మానవహారం చేపట్టి మద్దతు తెలిపారు. ఆర్డీసీ బస్టాండ్‌ నుంచి టీ సర్కిల్‌ మీదుగా ఎన్టీఆర్‌ భవన వరకు ర్యాలీ కొనసాగింది. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీసర్కిల్‌లో రాస్తారోకో నిర్వహించి మానవహారంగా ఏర్పడి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాలో  రాజధాని అమరావతి నిర్మాణానికి సంపూర్ణ మద్దతు తెలిపిన జగన, అధికారం వచ్చాక రాజధాని వికేంద్రీకణ చేస్తున్నట్లు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలన్న ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలపై నీళ్లుజల్లుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి దౌర్భగ్య ముఖ్యమంత్రి దే శంలోనే లేరని విమర్శించారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఉ ద్యమాన్ని ఉధృతం చేసి, పాలనను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.  ఏడాది పాటు రాజధాని ఉద్యమం సాగుతున్నా కనీసం వైసీపీ పాలకులు రైతుల స్థితిగతులను తెలుసుకునేందుకు అటువైపు చూడకపోవడం దౌర్భగ్యమన్నారు. వైసీపీ పెద్దలు ఇప్పటికే అనేక ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుని దందాలు చేస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే ప్రయ త్నం చేస్తున్నారని విమర్శించారు.  సిగ్గులేని ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులు బనాయించి న్యాయస్థానంతో చీవాట్లు పెట్టించుకున్నార ని విమర్శించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ప్రి యాంక, సీపీఐ తాలుకా కార్యదర్శి గోపాల్‌, సీనియర్‌ నాయకులు పాపంప ల్లి రామాంజినేయులు, ఆర్జీ శివశంకర్‌, శ్రీరాములు, మల్లికార్జున, గౌని శ్రీనివాసరెడ్డి, డీకే రామాంజినేయులు, గరికపాటి హరికృష్ణ, రాజశేఖర్‌గౌడ్‌, గ డ్డం రామాంజినేయులు, పోస్టు పాలన్న, కొల్లపురప్ప, మల్లిపల్లి నారాయణ, గోళ్ల రాము, అనీల్‌చౌదరి,  ములకనూరుకృష్ట, మల్లేష్‌, కుణేసాయి, గురుప్రసాద్‌, రంగప్ప, దండు సత్యనారాయణ, ఊటంకి రామాంజినేయులు, షామీర్‌, చిత్తప్ప పాల్గొన్నారు.

Read more