నెల తిరక్కుండానే పంపించేశారు..!

ABN , First Publish Date - 2020-12-13T06:37:02+05:30 IST

జిల్లా పోలీసుశాఖపై రాజకీయ పెత్తనం పెరిగిపోయింది. ఇద్దరు పోలీసు అధికారులను నెల తిరక్కుండానే వీఆర్‌కు బదిలీ చేశారు.

నెల తిరక్కుండానే పంపించేశారు..!

పోలీసులపై రాజకీయ పెత్తనం!

  వీఆర్‌కు డీఎస్పీ, సీఐ

అనంతపురం క్రైం, డిసెంబరు 12: జిల్లా పోలీసుశాఖపై రాజకీయ పెత్తనం పెరిగిపోయింది. ఇద్దరు పోలీసు అధికారులను నెల తిరక్కుండానే వీఆర్‌కు బదిలీ చేశారు. జిల్లాలు దాటి అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు.. పోలీసులపై బదిలీల రూపం లో కక్ష సాధింపునకు దిగుతున్నారనే వి మర్శలున్నాయి. టీడీపీ హయాంలో తమ కు కేసులు, ఇతర అంశాల పరంగా సహకరించలేదనే కోపంతో కసితీర్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి పోలీసులకు ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్క డ ఎలాంటి పోస్టింగ్‌ ఇచ్చినా కొంద రు ప్రజాప్రనిధులు జీర్ణించుకోలేక వారిపై ఉన్నతాధికారులకు తర చూ లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం.. తా జాగా జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఉన్నతాధికారులను ఉన్నఫలంగా వీఆర్‌కు బదిలీ చే యడమే. అదీ కూ డా ఒకే సబ్‌ డివిజన్‌ పరిధిలోని అధికారులపై వేటు వే యటం విమర్శలకు తావిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేర కు.. కడప జిల్లా ఎస్‌బీ విభాగంలో పనిచేస్తున్న డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌ను గతనెల 19వ తేదీన పెనుకొండ  డీఎస్పీగా ఆ శాఖ ఉన్నతాధికారులు నియమించారు. ఆయన వెంటనే విధుల్లో చేరిపోయారు. ఇంతలోనే ఏమి జరిగిందో ఏమో కానీ 24 రోజులు కూడా గడవకుండానే వీఆర్‌కు బదిలీ చేశారు. డీఎస్పీ స్థాయి అధికారిని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి, నియమిస్తారు. అలా జరిగినప్పటీకి రోజుల వ్యవధిలో బదిలీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ప్రధాన ప్రజాప్రతినిధి రాష్ట్రస్థారులో పోలీసు ఉన్నతాఽధికారిలతో మాట్లాడి, ఒత్తిడి తెచ్చి మరీ వీఆర్‌కు బదిలీ చేయించారనే ప్రచారం పోలీసుశాఖలో జోరుగా సాగుతోంది.   ఇదే డీఎస్పీ 2018-2019 సంవత్సరంలో చిత్తూరు ఎస్సీ, ఎస్టీ సెల్‌ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో ఆ ప్రజాప్రతినిధి సమీప బంధువులైన ఓ మహిళ కేసు విషయంలో తమకు అనుకూలంగా పనిచేయలేదనే కక్షతో డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌ను వీఆర్‌కు పంపించేలా చక్రం తిప్పినట్లుఆ శాఖ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఎక్కడా పోస్టింగ్‌ లేకుండా చేస్తానని హెచ్చరించినట్లు కూడా సమాచారం. తనకు వ్యతిరేకంగా పనిచేసిన ఆ పోలీసు అధికారికి పోస్టింగ్‌ విషయంలో ఎలా సహకరిస్తారని జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధిపై మండిపడినట్లు వినికిడి. చివరకు చిత్తూరు జిల్లాకు చెందిన ఆ ప్రజాప్రతినిధి మాట నెగ్గడంతో డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌ వీఆర్‌కు వెళ్లాల్సి వచ్చిందని ఆ శాఖలో చర్చ సాగుతోంది.

హిందూపురం అప్‌గ్రేడ్‌ పోలీసుస్టేషన్‌ సీఐ శ్రీరామ్‌ను ఉన్నఫలంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రికి రాత్రే వీఆర్‌కు పంపుతున్నట్టు మౌఖికంగా ఆదేశాలు జారీ చేయటం అనుమానాలకు తావిస్తోంది. సీఐ శ్రీరామ్‌ జిల్లా పోలీసు శాఖలోని డీసీఆర్‌బీ విభాగంలో పనిచేస్తుండగా గతనెల 19వ తేదీన హిందూపురం అప్‌గ్రేడ్‌ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. 24 రోజులు గడకవకుండానే ఆయనను వీఆర్‌కు బదిలీ చేయటం దుమారం రేపింది. ఇందులో ప్రజాప్రతినిధులు చక్రం తిప్పినట్లు సమాచారం. ఆ స్టేషన్‌ పరిధిలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. వాటి నుంచి అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు కొందరు అక్కడి ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి, నెలవారీ మాముళ్లు వసూలు చేస్తున్నట్లు సీఐ దృష్టికొచ్చింది. అలాంటి వాటికి అవకాశం లేదనీ, నెలవారీ మామూళ్లు ఇవ్వకండని ఫ్యాక్టరీల యజమానులకు సీఐ ఆదేశించారు. విషయం అక్కడి ప్రజాప్రతినిధుల దృష్టికెళ్లటంతో సీఐ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, వీఆర్‌కు బదిలీ చేయించినట్లు సమాచారం. ఇలా ఇద్దరు పోలీసు ఉన్నతాధి కారులు 24 రోజుల వ్యవధిలో వీఆర్‌కు బదిలీ చేయటం విమర్శలకు తావిస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం పాలన అనుకూలత కింద బదిలీ చేసినట్లు చెబుతున్నారు.

Updated Date - 2020-12-13T06:37:02+05:30 IST