వెయిటేజ్‌ మార్కులకు వివరాలు అప్‌లోడ్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-10-07T08:42:57+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు-2020కి హాజరైన ఇన్‌సర్వీసు (ఓటీపీఆర్‌) అభ్యర్థులు వెయిటేజ్‌ మార్కులకు తమ ధ్రువీకరణ పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని

వెయిటేజ్‌ మార్కులకు వివరాలు అప్‌లోడ్‌ చేయాలి

అనంతపురం విద్య, అక్టోబరు 6: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు-2020కి హాజరైన ఇన్‌సర్వీసు (ఓటీపీఆర్‌) అభ్యర్థులు వెయిటేజ్‌ మార్కులకు తమ ధ్రువీకరణ పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని జిల్లా ఎంపిక కమిటీ మెంబర్‌ కన్వీనర్‌ శోభాస్వరూపణి మంగళవారం ప్రకటనలో సూచించారు. ఆ అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుని, వారి శాఖాధిపతులతో నిర్ధారించి.. వాటిని బుధవారం సాయంత్రం 6 గంటల్లోపు అప్‌లోడ్‌ చేయాలని వివరించారు. లేకుంటే వెయిటేజ్‌ మార్కులు కలపబోమని స్పష్టం చేశారు.

Read more