శ్రీకాకుళం జిల్లాను తాకిన కరోనా సెగ

ABN , First Publish Date - 2020-04-25T18:56:00+05:30 IST

శ్రీకాకుళం: కరోనా సెగ శ్రీకాకుళం జిల్లాను సైతం తాకింది. పాతపట్నం ప్రాంతంలో పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.

శ్రీకాకుళం జిల్లాను తాకిన కరోనా సెగ

శ్రీకాకుళం: కరోనా సెగ శ్రీకాకుళం జిల్లాను సైతం తాకింది. కరోనా ప్రభావం ఏమాత్రం లేని జిల్లాలో విజయనగరంతో పాటు శ్రీకాకుళం కూడా ఉండేది. నేడు అకస్మాత్తుగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా అధికారులు ఉలిక్కిపడ్డారు. పాతపట్నం ప్రాంతంలో పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పాతపట్నం ప్రాంతంలో పగడ్బంధీగా లాక్ డౌన్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగువాడ, సీది గ్రామాల్లో 26 మందిని క్వారంటైన్‌కు తరలించారు.


Updated Date - 2020-04-25T18:56:00+05:30 IST