కాంటినెంటల్‌ యాపిల్‌ కేక్‌

ABN , First Publish Date - 2019-12-21T18:57:40+05:30 IST

పిండి - 150 గ్రాములు, బేకింగ్‌ పౌడర్‌ - రెండు టీస్పూన్లు, వెన్న - 50 గ్రాములు, కాస్టర్‌ పంచదార - 150 గ్రాములు

కాంటినెంటల్‌ యాపిల్‌ కేక్‌

కావలసిన పదార్థాలు: పిండి - 150 గ్రాములు, బేకింగ్‌ పౌడర్‌ - రెండు టీస్పూన్లు, వెన్న - 50 గ్రాములు, కాస్టర్‌ పంచదార - 150 గ్రాములు, కోడిగుడ్లు - రెండు, పాలు - 100 ఎంఎల్‌, యాపిల్స్‌ - మూడు, దాల్చిన చెక్క పొడి - ఒక టీస్పూన్‌.
 
తయారీ విధానం: ఒక పాత్రలో పిండి తీసుకొని బేకింగ్‌ పౌడర్‌ వేసి కలుపుకోవాలి. తరువాత వెన్న, పంచదార, కోడిగుడ్లు, పాలు వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని కేక్‌ టిన్‌లో పోసి, పైన చిన్నగా కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలు పెట్టాలి. పంచదార, దాల్చిన చెక్క పొడి చల్లాలి. ఈ టిన్‌ను ఓవెన్‌లో 190 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత వద్ద 30 నుంచి 35 నిమిషాల బేక్‌ చేయాలి. చల్లారిన తరువాత సర్వ్‌ చేసుకోవాలి.

Read more