వుడ్‌ యాపిల్‌ స్క్వాష్‌

ABN , First Publish Date - 2018-03-22T17:29:45+05:30 IST

వుడ్‌ యాపిల్‌ (వెలగ పండు) - ఒకటి, బెల్లం తురుము లేదా పంచదార - రెండు టేబుల్‌ స్పూన్లు...

వుడ్‌ యాపిల్‌ స్క్వాష్‌

కావలసినవి
 
వుడ్‌ యాపిల్‌ (వెలగ పండు) - ఒకటి, బెల్లం తురుము లేదా పంచదార - రెండు టేబుల్‌ స్పూన్లు, బ్లాక్‌ సాల్ట్‌ - రుచికి తగినంత, జీలకర్ర పొడి - ఒకటీస్పూన్‌, నిమ్మకాయ (రసం తీసి) - ఒకటి, పుదీనా ఆకులు, మంచి నీళ్లు - సరిపడా, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని.
 
తయారీవిధానం
 
వెలగపండు షర్బత్‌ తయారీలో ముందు పుదీనా ఆకులను కచ్చాపచ్చాగా నలిపి పెట్టాలి. వెలగపండును పగలగొట్టి గుజ్జును ఒక పెద్ద గిన్నెలోకి తీయాలి.
తరువాత ఆ గుజ్జులో కొన్ని నీళ్లు పోసి చేతితో మెదపాలి. ఇలా చేయడం వల్ల గింజలు గుజ్జు నుండి విడివడతాయి. గుజ్జు మొత్తం నీళ్లలో కలిసిపోయాక ఆ నీటిని వడకట్టి గింజలను వేరుచేయాలి. మళ్లీ ఒకసారి ఇలానే వాటిలో మరికొన్ని నీళ్లు పోసి వడకట్టాలి.
తరువాత ఆ నీళ్లలో బెల్లం తురుము లేదా పంచదార, నిమ్మరసాలతో పాటు మిగతా పదార్థాలను కూడా వేసి కలపాలి. తరువాత కచ్చాపచ్చాగా చేసిన పుదీనా ఆకులను వేసి మళ్లీ ఒకసారి కలపాలి. ఇందులో మంచి నీళ్లు పోసి, ఐస్‌క్యూబ్స్‌ వేసి చల్లచల్లగా తాగితే చాలా రుచిగా ఉంటుంది. వేడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Read more