పిల్లల్లో ADHD సమస్య ఉన్నట్లు తెలిపే సంకేతాలు ఇవే..

హైపర్యాక్టివిటీ ఉంటుంది. ఈ సమస్య ఉన్న పిల్లల్లో అతిగా కదలడం, విశ్రాంతి లేకపోవడం, ఒకే చోట కూర్చోవడం కష్టంగా ఉంటుంది.

ఇంపల్సివిటీ ఆలోచించకుండా ఏదైనా చేయడం అనే ఇబ్బంది ఉంటుంది. ఇతరులకు అంతరాయం కలిగించడం ఈ పిల్లల్లో ఎక్కువగా కనిపించే లక్షణం

టైం మేనేజ్మెంట్ లేకపోవడం..  ADHD ఉన్నవారిలో గడువులోపు పనులు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఉంటాయి.

మతిమరుపు సమస్య కూడా ఉంటుంది. ఇంటి పనులు, లేదా చదువు సంగతి మరిచిపోవడం ఈ పిల్లల్లో మరో సంకేతం.

సామాజిక పరిస్థితులలో ఇబ్బంది ఉంటుంది. ఏదైనా పనిని నలుగురిలో చేయాల్సి వచ్చినా వీరికి ఇబ్బందిగానే ఉంటుంది. 

అజాగ్రత్త..  ADHD ఉన్న వారిలో దృష్టి పెట్టడానికి సమస్యగా మారుతుంది. తరచుగా తప్పులు చేయడం, మతిమరుపు ఉంటుంది.

అయోమయం ఉంటుంది. పనులకు ఇబ్బంది పడుతుంటారు. ఇదంతా ADHD ప్రధానమైన లక్షణం.