ఆవనూనె వాడితే జరిగే అద్భుతాలు ఇవే..!

ఆవాల నూనె వంటలకే కాకుండా జుట్టు, చర్మం, ఆరోగ్య సంరక్షణలో ప్రభావవంతంగా ఉంటుంది.

ఆవనూనెలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది.  ఇది ఆకలిని పెంచడంలో సహాయపడుతుంది.

ఆవనూనె వాడితే మలబద్దకం నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.  జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఆవాల నూనె శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఆవాలనూనెతో శరీరానికి మసాజ్ చేయడం వల్ల కండరాలు బలపడతాయి.

ఆస్థియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించి ఎముకలను దృఢంగా ఉంచడంలో ఆవాల నూనె సహాయపడుతుంది.

చర్మానికి పోషణను అందించడంలోనూ, మొటిమలు, ముడతలు, పొడిచర్మం వంటి చర్మ సమస్యలను నివారించడంలోనూ ఆవాలనూనె బాగా పనిచేస్తుంది.

జుట్టు ఒత్తుగా, బలంగా పెరగడానికి, జుట్టుకు మెరుపు అందించడంలోనూ ఆవాల నూనె ప్రభావవంతంగా ఉంటుంది.

కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఆవాల నూనెను వాడితే ఉపశమనం ఉంటుంది.