వేసవిలో దోసకాయలు తింటే.. ఈ లాభాలు మీ సొంతం!

వేసవిలో దోసకాయను తింటే.. ఇది వేడి తగ్గించి, శరీరాన్ని లోపల నుంచి చల్లబరుస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాల్ని అందిస్తుంది.

దోసకాయలోని వాటర్ కంటెంట్, ఫైబర్.. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.

డీహైడ్రేషన్‌తో బాధపడేవారు.. దోసకాయని డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి నీరు అందుతుంది. ఇందులో 95 శాతం నీరు ఉంటుంది.

దోసకాయ శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్‌ని అందిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, సోడియం లోపం ఉన్నవారు దీన్ని కచ్ఛితంగా తినాలి.

దోసకాయలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి, ఎముకల సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది.

దోసకాయ రెగ్యులర్‌గా తింటే.. రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. ఫలితంగా.. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది.

దోసకాయలోని విటమిన్లు.. చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. దోసకాయ తింటే.. చర్మం హైడ్రేటెడ్‌గా మృదువుగా తయారవుతుంది.

కేలరీలు తక్కువగా ఉండే దోసకాయలో పీచుపదార్థం ఉంటుంది. దీన్ని తిన్నప్పుడు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో బరువు తగ్గుతారు.

దోసకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది పొటాషియంతో కలిసి.. మూత్రపిండాల మలినాలను తొలగించడానికి తోడ్పడుతుంది.