పర్యాటక స్వర్గధామం విశాఖ:

విశాఖ నగరానికి వచ్చే పర్యాటకులు విధిగా సందర్శించే ప్రాంతం ఆర్కేబీచ్‌. నగరం నుంచి భీమిలి వరకు 30 కిలోమీటర్ల బీచ్‌రోడ్డులో ప్రయాణం మరచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పాలి. దేశంలో రెండో పురాతన మునిసిపాలిటీ భీమిలి. భీమిలి తీరం, అక్కడ లైట్‌ హౌస్‌, డచ్‌ సమాధులు, ఫ్లాగ్‌షిప్‌ సెమిట్రీ గత చరిత్రకు ఆనవాళ్లుగా కనిపిస్తాయి. తొట్లకొండ, బావికొండలపై బౌద్ధ స్థూపాలు, మహాస్థూపాల గురించి పర్యాటకులు తెలుసుకోవలసిందే. తొట్లకొండ, బావికొండ నుంచి సముద్ర అందాలు మనోహారంగా కనిపిస్తాయి. ఆగ్నేసియా దేశాల నుంచి బౌద్ధ భిక్షువులు తరచూ ఈ ప్రాంతాలను సందర్శిస్తారు. భీమిలి సమీపంలో తీరానికి ఆనుకుని ఎర్రమట్టి దిబ్బలు వేల సంవత్సరాల చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తాయి. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలలో ట్రెక్కింగ్‌ ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. విశాఖ నగరంలో కైలాసగిరి, జంతు ప్రదర్శశాల, కురుసుర సబ్‌మెరైన్‌ మ్యూజియం పర్యాటకుల గమ్యస్థానాలుగా పిలుస్తారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయం దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచింది. రోజు వేలాది మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు. నగరంలో మరో ప్రసిద్ధ ఆలయం శ్రీకనకమహాలక్ష్మి దేవాలయం. ఇక విశాఖ జిల్లాలోని అరకులోయ, బొర్రాగుహలు, అనంతగిరి కాఫీ తోటలు, లంబసింగి, ఏజెన్సీలో కొత్తపల్లి, రణజిల్లెడ జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి విమానాలు, రైలు ప్రయాణం, బస్సు మార్గాలతో విశాఖపట్టణానికి కనెక్టివిటీ ఉంది.


ఆర్కే బీచ్‌

RK Beach

రామకృష్ణమఠం ఈ బీచ్‌కు దగ్గరలో ఉన్నందువలన ఈ పేరు వచ్చింది. ప్రతిరోజు వేలాది మంది సందర్శకులు ఆర్కే బీచ్‌ను సందర్శిస్తుంటారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు ప్రధాన వేదికగా నిలుస్తోంది. విశాఖకు పర్యాటకంగా పేరు తీసుకువచ్చే వాటిలో ఆర్కే బీచ్‌ ఒకటి. ఆర్కే బీచ్‌కు అభిముఖంగా కాళీమాత గుడి ఉంటుంది. బీచ్‌కు సమీపంలో బస చేయడానికి స్టార్‌హోటళ్లు, బడ్జెట్‌ హోటళ్లు ఉన్నాయి.

ఎలా వెళ్ళాలంటే...

ఆర్టీసీ కాంప్లెక్స్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. సిటీ బస్సులు, ఇతర వాహనాల ద్వారా చేరుకోవచ్చు.

సింహాచలం

Simhachalam

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవాలయం ఒకటి. క్రీ.శ. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయంలో శిల్ప కళా సంపద భారతీయ వారసత్వానికి ప్రతీకగా చెప్పాలి. ప్రతి ఏడాది వైశాఖమాసంలో జరిగే చందనోత్సవం ఎంతో ప్రసిద్ధమైనది. ఈ ఆలయంలో ఉన్న కప్ప స్తంభానికి ఎంతో ప్రాచుర్యం ఉంది. ఈ స్తంభాన్ని ఆలింగనం చేసుకుని మనసులో కోరుకున్న కోరికలు తప్పక నెరవేరతాయని ప్రతీతి.

ఎలా వెళ్ళాలంటే...

విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి 17 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్‌ నుంచి 16 కిలోమీటర్లు, విమానాశ్రయం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. సింహాచలం కొండపై, దిగువన లాడ్జిలు, టీటీడీ కాటేజీలు ఉన్నాయి.

కైలాసగిరి

Kailasagiri

కైలాసగిరి పై నుంచి సముద్రం, నగర అందాలు పర్యాటకులు ఎవరైనా సరే తిలకించాల్సిందే. కొండపై సర్క్యులర్‌ రైలులో ప్రయాణం మంచి అనుభూతిని ఇస్తుంది. కొండపై శివపార్వతుల ఎత్తయిన విగ్రహం, శ్రీవారి నామాలు ప్రధాన ఆకర్షణ. కొండపై వున్న తెలుగు మ్యూజియం చూడదగ్గ ప్రదేశం. దీనికి దగ్గరలో ఏపీటీడీసీ రిసార్ట్స్‌, ప్రైవేటు హోటళ్లు ఉన్నాయి.

ఎలా వెళ్ళాలంటే...

ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి 8.6. కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే రోప్‌వే అయితే 5.7 కిలోమీటర్లే.

మత్య్సదర్శిని

Fishes-Darshini

ఆర్కే బీచ్‌కు అభిముఖంగా ఏర్పాటుచేసిన మత్య్సదర్శిని నగరంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. సింగపూర్‌, మలేషియా, తదితర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన రకరకాల చేపలతో అలరారే మత్స్యదర్శినిని జీవీఎంసీ ఏర్పాటుచేసి లీజుకు ఇచ్చింది. తొలుత మునిసిపల్‌ కమిషనర్‌ బంగ్లాలో ఉన్న మత్స్యదర్శినిని 1990లో ఆర్కే బీచ్‌ సమీపంలో ఏర్పాటుచేశారు.

కురుసుర మ్యూజియం

RK Beach

తీరంలో ఏర్పాటుచేసిన తొలి సబ్‌మెరైన్‌ మ్యూజియం ఇది. భారత నౌకాదళంలో నాల్గవ సబ్‌మైరైన్‌ కురుసుర. 1969లో భారత నౌకాదళంలో చేరిన కురుసుర 2001 వరకు సేవలు అందించింది. తరువాత డీకమిషన్‌ చేశారు. 1971లో భారత్‌, పాకిస్థాన్‌ యుద్ధంలో సేవలు అందించిన దీనిని విశాఖలో మ్యూజియంగా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. సందర్శకులకు అనువుగా రూపొందించి 2002 ఆగస్టులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ప్రస్తుతం వుడా దీనిని నిర్వహిస్తోంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు 3.6 కిలోమీటర్ల దూరంలో ఆర్కే బీచ్‌ రోడ్డులో ఈ మ్యూజియం ఉంది. కురుసుర ఎదురుగానే కొత్తగా టీయూ 142 యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటుచేశారు.

రుషికొండ బీచ్‌

Rushikonda

విశాఖపట్నం-భీమునిపట్నం బీచ్‌ రోడ్డులో వుండే ప్రధాన బీచ్‌ రుషికొండ. విశాలమైన తీరం వుండే ప్రాంతం ఇది. నగరానికి వచ్చే పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో రుషికొండ బీచ్‌ ఒకటి. ఇక్కడ పర్యాటకాభివృద్ధి సంస్థ రిసార్ట్స్‌ ఉన్నాయి. ప్రైవేటు రిసార్ట్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇటీవల దేశంలో బ్లూఫ్లాగ్‌ బీచ్‌లకు ప్రతిపాదించిన 13 బీచ్‌లలో రుషికొండ బీచ్‌ ఉంది. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన కాటేజీలు, రెస్టారెంట్‌ ఉన్నాయి.

ఎలా వెళ్ళాలంటే...

బస్ కాంప్లెక్స్‌ నుంచి 13 కిలోమీటర్ల దూరం.

బావికొండ, తొట్లకొండ

Bhavi-konda

బౌద్ధమతానికి సంబంధించి బలమైన ఆనవాళ్లు వున్న ప్రాంతాలు బావికొండ, తొట్లకొండ. అక్కడకు మరో కిలోమీటరు దూరంలో బావికొండ ఉంటుంది. బుద్ధుని ధాతువు, మహాస్థూపాలు, బౌద్ధమతానికి సంబంధించిన నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. రోమన్‌ కాలానికి సంబంధించిన రాగి, వెండి నాణేలు లభ్యమయ్యాయి. తొట్లకొండను పురావస్తు శాఖ గుర్తించింది. రవాణా సదుపాయం ఉంది. తొట్లకొండ కొండ దిగువన తీరంలో ఇటీవల రిసార్ట్స్‌ నిర్మించారు.

ఎలా వెళ్ళాలంటే...

విశాఖపట్టణం నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో తొట్లకొండ ఉంది. విరివిగా బస్సు సదుపాయం ఉంది.

భీమునిపట్నం

Bheemunipatnam

తూర్పుతీరంలో అతి పురాతన ఓడరేవు భీమిలి. దేశంలో రెండో పురాతన మునిసిపాలిటీ. డచ్‌ పాలకులకు చెందిన సమాధులు, పురాతన లైట్‌హౌస్‌ ఇక్కడ ఉన్నాయి. సముద్రంలో గోస్తనీ నది ఈ ప్రాంతంలోనే కలుస్తుంది. ఎక్కువ మంది పర్యాటకులు భీమిలి బీచ్‌ను సందర్శిస్తారు. భీమిలిలో వుడా గెస్ట్‌హౌ్‌స్‌తోపాటు గత ఏడాది వరుణ్‌ నోవాటెల్‌ హోటల్‌ ఉంది.

ఎలా వెళ్ళాలంటే...

విశాఖపట్టణం నగరానికి 28 కిలోమీటర్ల దూరంలో భీమిలి ఉంది. బస్సులలో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

ఎర్రమట్టి దిబ్బలు

Erramatti Dibbalu

విశాఖపట్నం-భీమిలి బీచ్‌ రోడ్డులో ఎర్రమట్టి దిబ్బలున్నాయి. వేల సంవత్సరాల క్రితం ఇవి ఏర్పడ్డాయని ఆంత్రోపాలజిస్టులు గుర్తించారు. దేశంలో ఇంత పెద్ద ఎర్రమట్టి దిబ్బలు ఇంకెక్కడా లేవు. వీటిని వారసత్వ సంపదగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించింది. ఎర్రమట్టి దిబ్బలు పూర్తిగా కనిపించేలా పర్యాటక శాఖ ఇక్కడ వ్యూ పాయింట్‌ నిర్మించింది. తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన అనేక సినిమాలు ఇక్కడ తీశారు.

ఎలా వెళ్ళాలంటే...

విశాఖకు 24 కిలోమీటర్ల దూరంలో భీమిలికి సమీపంలో ఈ ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి. బస్సులలో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

ఇందిగాంధీ జంతుప్రదర్శనశాల

Indira Gandhi National Park

నగరంలో జాతీయ రహదారిని ఆనుకుని జంతుప్రదర్శనశాల ఉంది. ఇక్కడ అనేక రకాల అడవి జంతువులు ఉన్నాయి. విశాలమైన ప్రాంతంలో ఏర్పాటుచేసిన జూలో విరివిగా ఉన్న చెట్లు ప్రధాన ఆకర్షణ. దీనికి ఎదురుగా జాతీయ రహదారికి మరోవైపు వున్న కంబాలకొండ అభయారణ్యం కూడా చూడదగ్గ ప్రదేశం. ఎకో టూరిజం పేరిట అభివృద్ధి చేసిన కంబాలకొండలో చెరువులు, సైట్‌సీయింగ్‌ టవర్స్‌ ఉన్నాయి.

ఎలా వెళ్ళాలంటే...

ఆర్టీసీ ద్వారకా కాంప్లెక్స్‌ నుంచి 6.2 కిలోమీటర్ల దూరంలో ఇవన్నీ ఉన్నాయి. బస్సుల, ఇతర వాహనాల ద్వారా ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు.

అరకులోయ

Arakuloya

ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకులోయ రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రం. విశాఖ నుంచి రైలులో అరకు వెళ్లడానికి పర్యాటకులు ఇష్టపడతారు. టన్నెల్స్‌ను దాటుకుంటూ వెళ్లే రైలు ప్రయాణం కొత్త అనుభూతినిస్తోంది. విశాఖ నుంచి వెళ్లే అరకులోయ మీదుగా కిరండోల్‌ వెళ్లే పాసింజర్‌గా గత ఏడాది కొత్తగా అద్దాలకోచ్‌ను ఏర్పాటు చేశారు. అరకులోయ ఏపీటీడీసీకి చెందిన రెండు రిసార్ట్స్‌తోపాటు ప్రైవేటు హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అరకులోయలో పద్మాపురం గార్డెన్స్‌, గిరిజన మ్యూజియం, రణజల్లెడ జలపాతం, చాపరాయి చూడవచ్చు. వీటితోపాటు స్థానికంగా ఉన్న ఎన్నెన్నో ఫలపుష్ప ఉద్యానవనాలు, జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.

ఎలా వెళ్ళాలంటే...

విశాఖ నుంచి 114 కిలోమీటర్ల దూరంలో అరకు హిల్‌స్టేషన్‌ ఉంది. రైలు, బస్సు సదుపాయాలున్నాయి.

బొర్రాగుహలు

Borra Caves

బొర్రాగుహలను 1807లో బ్రిటీష్‌ ఖగోళ శాస్త్రవేత్త విలియం కింగ్‌ కనుగొన్నారు. ఈ గుహలు పది లక్షల సంవత్సరాల క్రితమే ఏర్పడి వుంటాయనేది అంచనా. ఇక్కడ ఏయూ ఆంత్రోపాలజిస్టులు నిర్వహించిన తవ్వకాల్లో 30 వేల నుంచి 50 వేల సంవత్సరాల క్రితం నాటి పనిముట్లు కనుగొన్నారు. 1990లో పర్యాటకాభివృద్ధి సంస్థ ఈ గుహలను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఏపీడీసీయే నిర్వహిస్తోంది. బొర్రాగుహలను రోజుకు సగటును ఏడు వేల మంది సందర్శిస్తున్నారు. సమీపంలోని అనంతగిరిలో ఉన్న రిసార్ట్స్‌లో బస చేయవచ్చు.

ఎలా వెళ్ళాలంటే...

విశాఖ నుంచి బొర్రాగుహలు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రైలు, రోడ్డు మార్గాలలో ఇక్కడికి చేరుకోవచ్చు.

లంబసింగి

Lambasingi

ఆంధ్ర కాశ్మీర్‌గా పిలిచే లంబసింగి చింతపల్లికి దగ్గరలో ఉంది. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత జీరో డిగ్రీలకు చేరుకుంటుంది. దీంతో నవంబర్‌ నుంచి జనవరి నెలాఖరు వరకూ వేల సంఖ్యలో పర్యాటకులు లంబసింగి సందర్శిస్తుంటారు. ఇక్కడ వసతి సౌకర్యం ప్రస్తుతానికి లేదు. అయితే టెంట్‌ కాటేజీలు ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానున్నాయి. లంబసింగి సమీపంలో కొత్తపల్లి జలపాతం, కేడీ పేటలో అల్లూరి స్మారక పార్కు ఉన్నాయి.

ఎలా వెళ్ళాలంటే...

విశాఖకు 120 కిలోమీటర్ల దూరంలో లంబసింగి ఉంది. రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు.

image-Icon చిత్రమాలిక :

ప్యాకేజీలు

విశాఖ నగరంలో పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ప్రతిరోజు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏపీటీడీసీ సెంట్రల్‌ రిజర్వేషన్‌ స్టేషన్‌ నుంచి ప్యాకేజీ టూర్లు ఉన్నాయి. ఇంకా అరకులోయకు ఉదయం రైలులో తీసుకువెళ్లి తిరిగి సాయంత్రం రోడ్డు మార్గాన తీసుకువచ్చేలా రైల్‌ కమ్‌ రోడ్డు ప్యాకేజీ ఉంది.

పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య...

విశాఖను సందర్శిస్తున్న వారిలో పశ్చిమ బెంగాల్‌ వాసులదే అగ్రస్థానం. ఇటీవల ఒడిశా నుంచి పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు విశాఖ వేదిక కావడంతో సందర్శకుల సంఖ్య పెరుగుతుంది. నగరంలో అన్నిరకాల స్టార్‌ కేటగిరీ కలిగిన హోటళ్లలో 620 గదులు అందుబాటులో ఉన్నాయి. ఏడాదిలోగా మరో 400 గదులు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదన ఉంది. హెల్త్‌ టూరిజం కూడా పెరుగుతుంది. ఆస్పత్రులు పెరగడంతో పొరుగు రాష్ట్రాల నుంచి వైద్యం కోసం నగరానికి వస్తున్నవారి సంఖ్య బాగా పెరిగింది. ఈ ఏడాది ఆగస్టు వరకు విశాఖ జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య కోటి దాటింది.

జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య
సంవత్సరం దేశీయులు విదేశీయులు
2011 51.39 Lakhs 28,677
2012 52.73 Lakhs 53,859
2013 53.53 Lakhs 53,940
2014 67.82 Lakhs 54,272
2015 1.04 Crores 64,178
2016 1.74 Crores 78,266
2017 2.12 Crores 92,958
 

పర్యాటకాభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న వసతి వివరాలు:

రుషికొండ బీచ్‌ రిసార్ట్స్‌
ప్రెసిడెన్షియల్‌ సూట్‌ 1
సోమ నుంచి గురువారం వరకు Rs. 4,000/-
మిగిలిన రోజుల్లో Rs. 4,800/-
ఏసీ సూట్‌లు 2
సోమ నుంచి గురువారం వరకు Rs. 2,750/-
మిగిలిన రోజుల్లో Rs. 3,300/-
ఏసీ లగ్జరీ గదులు 10
సోమ నుంచి గురువారం వరకు Rs. 2,500/-
మిగిలిన రోజుల్లో Rs. 3,000/-
ఏసీ ఎగ్జిక్యూటివ్‌ గదులు 12
సోమ నుంచి గురువారం వరకు Rs. 2,200/-
మిగిలిన రోజుల్లో Rs. 2,600/-
ఏసీ డీలక్స్‌ గదులు 20
సోమ నుంచి గురువారం వరకు Rs. 2,000/-
మిగిలిన రోజుల్లో Rs. 2,400/-
ఏసీ స్టాండర్డ్‌ గదులు 10
సోమ నుంచి గురువారం వరకు Rs. 1,700/-
మిగిలిన రోజుల్లో Rs. 2,000/-
సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు
0891-2788826, 9948813581, 9705173600
హరితా హిల్‌ రిసార్ట్స్‌, అనంతగిరి
ప్రెసిడెన్సియల్‌ సూట్‌ ధర Rs. 4,300/-
ఏసీ రూమ్‌ Rs. 3,000/-
నాన్‌ ఏసీ రూమ్‌ Rs. 2,300/-
నాన్‌ ఏసీ స్టాండర్‌ ధర Rs. 1,500/-
సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు
08936- 249202
అప్పుఘర్‌ వద్ద హరిత రిసార్ట్‌
ఏసీ ఫోర్‌ బెడ్‌ గది 1
సోమ నుంచి గురువారం వరకు Rs. 2,300/-
మిగిలిన రోజుల్లో Rs. 2,800/-
ఏసీ సూట్‌ గదులు 5
సోమ నుంచి గురువారం వరకు Rs. 2,100/-
మిగిలిన రోజుల్లో Rs. 2,500/-
ఏసీ గదులు 29
సోమ నుంచి గురువారం వరకు Rs. 1,500/-
మిగిలిన రోజుల్లో Rs. 1,800/-
నాన్‌ ఏసీ గ్రౌండ్‌ గదులు 9
సోమ నుంచి గురువారం వరకు Rs. 1,200/-
మిగిలిన రోజుల్లో Rs. 1,400/-
ఏసీ డీలక్స్‌ గదులు 20
సోమ నుంచి గురువారం వరకు Rs. 2000/-
మిగిలిన రోజుల్లో Rs. 2400/-
ఏసీలో అదనపు వ్యక్తికి Rs. 300/-
నాన్‌ ఏసీలో అదనపు వ్యక్తికి.. Rs. 200/-
* రూ.1000లోపు బిల్లుకు జీఎస్టీ ఉండదు. రూ.1000 నుంచి రూ.2499 వరకు 12 శాతం, రూ.2500 నుంచి రూ.6500 వరకు అయితే 18 శాతం పన్ను ఉంటుంది.
సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు
0891 2788824, 9848813582, 8905173100
సమాచారం కేంద్రాలు (విశాఖలో)
మరిన్ని వివరాలు కోసం సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు
టోల్ ఫ్రీ నేం : 0891- 2788821,9848813585, 0891- 2788820, 9848813584, 9848023948
మయూరి హిల్‌ రిసార్ట్స్‌, అరకులోయ
వ్యాలీ ఫేసింగ్‌ లగ్జరీ రూమ్‌ Rs. 3,600/-
డీలక్స్‌ ఏసీ Rs. 2,500/-
స్టాండర్డ్‌ ఏసీ Rs. 2,200/-
డీలక్స్‌ నాన్‌ ఏసీ Rs. 1,800/-
స్టాండర్డ్‌ నాన్‌ ఏసీ Rs. 1,400/-
సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు
08936- 249204, 249393
వ్యాలీ రిసార్ట్స్‌, అరకులోయ
ఏసీ సూట్‌ రూమ్‌ Rs. 2,400/-
నాన్‌ ఏసీ సూట్‌ Rs. 2,200/-
నాన్‌ ఏసీ రూమ్‌ Rs. 1,200/-
సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు
08936- 249202
తైడా జంగిల్‌ బెల్స్‌, అనంతగిరి
లాగ్‌ కాటేజీ Rs. 2,200/-
న్యూబ్రిడ్జ్‌ కాటేజీ Rs. 2,400/-
న్యూఉడెన్‌ కాటేజీ Rs. 2,400/-
ఉడెన్‌ కాటేజీ Rs. 1,800/-
లాగ్‌ హట్‌లు నాన్‌ఏసీ Rs. 1,400/-
ఏరోకాన్‌ కాటేజీ Rs. 1,400/-
సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు
8985599377