అందమైన ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతం.. సుస్వాగతం..

నెల్లూరు జిల్లా పర్యాటకం...

ఎన్నో చారిత్రక, ఆధ్యాత్మిక, సహజసౌందర్య క్షేత్రాలతో పర్యాటకానికి పర్యాయపదంగా నిలిచింది నెల్లూరు జిల్లా. కొండలు, కోనలు, నదులు, సాగర తీరాలతో కూడిన ప్రకృతి సౌందర్యం... చరిత్రకు ఆనవాళ్లుగా ఆరవ శతాబ్దం నాటి చిహ్నాలు... మతసామరస్యాన్ని చాటే వందల ఏళ్ల నాటి దర్గాలు, ఆలయాలు, మరెన్నో పురాతన ఆధ్యాత్మిక కేంద్రాలు... దేశ శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని వినువీధుల ఊరేగించే అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు.. విశ్వవ్యాప్తంగా విహంగాలకు పురుడుపోసే నేలపట్టు... దేశ విదేశాల పక్షిజాతులకు ఆటవిడుపైన పులికాట్‌ సరస్సు... ఒకటి కాదు రెండు కాదు పర్యాటకుల్ని పరవశింపజేసే ప్రదేశాలు, సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే శాస్త్రీయ పరిశోధనా కేంద్రాలు, ఆహ్లాదాన్ని కలిగించే సుందర ప్రదేశాలు.. ఇలా ఎన్నో ఆసక్తికర పర్యాటక స్థలాలకు కేంద్ర బిందువుగా నెల్లూరు జిల్లా ఒక ఖ్యాతిని సంతరించుకుంది. నెల్లూరు జిల్లాకు క్రీస్తుశకం ఆరవ శతాబ్ది నుంచే ప్రత్యేక గుర్తింపు ఉంది. పల్లవులు, చోళులు, గోల్కొండ నవాబులు, విజయనగరాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. మహాభారతం రచించిన కవిత్రయంలో ఒకరైన తిక్కన సోమయాజి నెల్లూరు జిల్లాకు చెందిన వారే. ఉదయగిరి కోట శ్రీకృష్ణదేవరాలయ పాలనను గుర్తు చేస్తుంటే... వెంకటగిరి జమీందారీ హయాన్ని గుర్తుకు తెస్తుంది. మరిన్ని విశేషాలు

పశ్చిమ గోదావరి

తూర్పు గోదావరి

నవ్యాంధ్ర అమరధామం

కృష్ణా

విజయనగరం

విశాఖపట్టణం జిల్లా