శ్రీహేవళంబినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం; తిథి: తదియ ఉ. 11.23 తదుపరి చవితి; నక్షత్రం: స్వాతి రా. 2.15 తదుపరి విశాఖ;
వర్జ్యం: ఉ. 6.37-8.19; దుర్ముహూర్తం: ఉ. 6.08-6.56; అమృతఘడియలు: సా. 4.52-6.34; రాహుకాలం: ఉ. 9.00-10.30; సూర్యోదయం: 6.08; సూర్యాస్తమయం: 6.08
దినఫలాలు (జన్మ తేది ప్రకారం)
(సెప్టెంబర్ 23, 2017)

మేషం (మార్చి 21-ఏప్రిల్‌ 20 మధ్య పుట్టినవారు)

ఆర్థిక విషయాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది. భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో పాల్గొంటారు.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 21 మధ్య పుట్టిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు భాగస్వామి సహకారం లభిస్తుంది. కృషి రంగంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంకల్పం నెరవేరుతుంది. ప్రియతములతో విందు వినోదాల్లో పాల్గొంటారు.

మిథునం (మే 22-జూన్‌ 21 మధ్య పుట్టినవారు)

చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. సృజనాత్మకంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, హోటల్స్‌, క్యాటరింగ్‌, వ్యవసాయ రంగాల వారికి అనుకూలం.

కర్కాటకం (జూన్‌ 22 - జులై 22 మధ్య పుట్టిన వారు)

ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతముల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం (జులై 23 - ఆగస్టు 23 మధ్య పుట్టినవారు)

కుటుంబ సభ్యులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరం. సమావేశాలకు ఏర్పాట్లు చేస్తారు.

కన్య(ఆగస్టు 24-సెప్టెంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

రవాణా, ఏజెన్సీలు, బోధన రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. పెట్టుబడులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. అగ్రిమెంట్లు లాభిస్తాయి.

తుల(సెప్టెంబర్‌ 23-అక్టోబర్‌ 23 మధ్య పుట్టిన వారు)

పొదుపు పథకాలు, పెట్టుబడులు లాభిస్తాయి. వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త ప్రయోగాలకు తగిన సమయం. సంకల్పం నెరవేరుతుంది.

వృశ్చికం (అక్టోబర్‌ 24- నవంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. రాజకీయ, సినీరంగాల వారికి ఉల్లాసంగా ఉంటుంది. ఒక సమాచారం ఆహ్లాదం కలిగిస్తుంది.

ధనుస్సు (నవంబర్‌ 23-డిసెంబర్‌ 21 మఽధ్య పుట్టిన వారు)

బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. సినీ, రాజకీయ, ఫొటోగ్రఫీ, ఎగుమతుల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది.

మకరం (డిసెంబర్‌ 22-జనవరి 20 మధ్య పుట్టిన వారు)

బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో ప్రోత్సాహకరం. సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 18 మధ్య పుట్టిన వారు)

వేడుకలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.

మీనం (ఫిబ్రవరి 19- మార్చి 20 మధ్య పుట్టినవారు)

బంధుమిత్రులతో సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. పూర్వమిత్రులను కలుసుకుంటారు. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి.
దినఫలాలు (జన్మ తేది ప్రకారం)
(సెప్టెంబర్ 22, 2017)

మేషం (మార్చి 21-ఏప్రిల్‌ 20 మధ్య పుట్టినవారు)

బంధుమిత్రులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సాహస ప్రయత్నాలకు, పందాలకు అనుకూల సమయం కాదు. ఖర్చులు అంచనాలు మించుతాయి.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 21 మధ్య పుట్టిన వారు)

విందు వినోదాలు, వేడుకలకు ఖర్చులు అంచనాలు మించుతాయి. ఆరోగ్యం, ఆహార విషయాలపై శ్రద్ధ చూపించాలి. రిటైల్‌, హోటల్‌, వైద్య రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మిథునం (మే 22-జూన్‌ 21 మధ్య పుట్టినవారు)

చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా వేడుకల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. పెట్టుబడుల్లో నిదానం అవసరం. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.

కర్కాటకం (జూన్‌ 22 - జులై 22 మధ్య పుట్టిన వారు)

ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. రియల్‌ ఎస్టేట్‌, రిటైల్‌, గృహనిర్మాణ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది.

సింహం (జులై 23 - ఆగస్టు 23 మధ్య పుట్టినవారు)

సోదరీసోదరులు, బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రయాణాలు, సమావేశాల్లో అసౌకర్యానికి గురవుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక సమాచారం కలవరపెడుతుంది.

కన్య(ఆగస్టు 24-సెప్టెంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు వాయిదా వేయండి. షాపింగ్‌లో వస్తువుల నాణ్యత గమనించండి.

తుల(సెప్టెంబర్‌ 23-అక్టోబర్‌ 23 మధ్య పుట్టిన వారు)

బృందకార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేస్తారు. కీలక నిర్ణయాలు వాయిదా వేయండి. మీ నిర్ణయాలను సమీక్షించుకుంటారు. మనశ్శాంతి లోపిస్తుంది.

వృశ్చికం (అక్టోబర్‌ 24- నవంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

పూజలు, సంస్మరణల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. పెట్టుబడుల్లో నిదానం అవసరం. ప్రయాణాల్లో చికాకులు తప్పకపోవచ్చు. సినీ రాజకీయ రంగాలవారికి ప్రోత్సాహకరం.

ధనుస్సు (నవంబర్‌ 23-డిసెంబర్‌ 21 మఽధ్య పుట్టిన వారు)

బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాల్లో అసౌకర్యానికి గురవుతారు. స్నేహితులు, ప్రియతముల కోసం ఖర్చులు అధికం.

మకరం (డిసెంబర్‌ 22-జనవరి 20 మధ్య పుట్టిన వారు)

ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 18 మధ్య పుట్టిన వారు)

సమావేశాలు, బృందకార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. ప్రయాణాలు, చర్చలు సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. న్యాయ, బోధన, కన్సల్టెన్సీ రంగాల వారికి శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 19- మార్చి 20 మధ్య పుట్టినవారు)

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. మనసును ఏదో వెలితి వెంటాడుతుంది. పూజలు, వేడుకలు, సంస్మరణల్లో పాల్గొంటారు. క్రయవిక్రయాలలో నాణ్యత గమనించండి.