ఆలూ మఖానా సబ్జి
కావలసినవి
 
బేబీ బంగాళాదుంపులు- ఒక కప్పు, పూల్‌ మఖానా-(తామరగింజలు) ఒక కప్పు, జీలకర్ర- ఒక టీస్పూను, సోంపు- ఒక టీస్పూను, పచ్చిమిర్చి-2 (సన్నగా తరిగి), కారం- ఒకటిన్నర టీస్పూను, పసుపు- అర టీస్పూను, ధనియాలపొడి- ఒక టీస్పూను, ఉప్పు- తగినంత, నూనె- రెండు టేబుల్‌స్పూన్లు.
 
తయారీవిధానం
 
బేబీ బంగాళాదుంపల్ని నీళ్లల్లో ఉడకబెట్టాలి. తర్వాత వాటిపైనున్న పొట్టు తీయాలి.
బాగా లోతున్న పాన్‌ తీసుకని నూనె పోసి వేడెక్కాక అందులో మఖానా వేసి క్రిస్పుగా రోస్టు కానివ్వాలి. అది రెడీ అయిన తర్వాత విడిగా ఒక ప్లేటులో తీసిపెట్టుకోవాలి.
పాన్‌లో నూనె వేసి అందులో జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. అందులో సోంపు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేగించాలి. తర్వాత అన్ని మసాలాలు ఇందులో వేసి బాగా కలపాలి. తర్వాత ఉడకబెట్టిన బేబీ బంగాళాదుంపలను ఇందులో వేగనివ్వాలి.
బంగాళాదుంపలకు మసాలా బాగా పట్టిన తర్వాత రోస్టెడ్‌ మకానాను అందులో మళ్లీ ఇంకోసారి కలపాలి. మంటను తగ్గించి నాలుగు నిమిషాల పాటు బంగాళాదుంపలను చిన్న మంటపై టోస్ట్‌ చేయాలి. స్టవ్‌ మీద నుంచి దించి దానిపై కొత్తిమీర చల్లి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.
ఈ రోజు స్పెషల్ వంటకం
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.