ADVT
ఓట్స్‌ కిచిడీ
కావలసిన పదార్థాలు
 
ఓట్స్‌ - ముప్పావు కప్పు, నెయ్యి - ఒకటిన్నర టేబుల్‌ స్పూను, బిర్యానీ ఆకు - ఒకటి, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉల్లి తరుగు - అరకప్పు, అల్లం తరుగు - అర టీ స్పూను, పచ్చిమిర్చి - ఒకటి, టమోటా, క్యారెట్‌, క్యాప్సికం, ఆలూ తరుగు - అరకప్పు చొప్పున, పచ్చిబఠాణి - ముప్పావు కప్పు, పెసరపప్పు - ముప్పావు కప్పు, పసుపు - చిటికెడు, నీరు - రెండున్నర కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు - అరకప్పు.
 
తయారుచేసే విధానం
 
కడాయిలో నెయ్యివేసి బిర్యాని ఆకు, జీలకర్ర వేగించాలి. తర్వాత ఉల్లి, మిర్చి, అల్లం తరుగు, మిగతా కూరగాయల తరుగు ఒకటి తర్వాత ఒకటి వేస్తూ వేగించి, చివర్లో నానబెట్టి ఉంచిన పెసరపప్పు కూడా వేసి మగ్గించాలి. ఇప్పుడు ఓట్స్‌, పసుపు, ఉప్పు కలిపి నీరు పోసి మూత పెట్టి ఉడికించాలి. నీరు పూర్తిగా ఇంకిపోయాక చిన్నమంటపై మూతపెట్టి తడి పోయేవరకు ఉంచి దించేయాలి. రైతాతో వేడివేడిగా తింటే బాగుంటుంది.

Advertisement

ఈ రోజు స్పెషల్ వంటకం
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.