ADVT
ఉలువల వేపుడు
కావలసిన పదార్థాలు
ఉలవలు - ఒక కప్పు, ఎండుమిర్చి - 3, ఆవాలు - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు - 4 రెబ్బలు, పచ్చికొబ్బరి తురుము, ఉల్లి తరుగు - అరకప్పు చొప్పున, జీలకర్ర, కారం - అర టీ స్పూను చొప్పున, పసుపు - పావు టీ స్పూను.
 
తయారుచేసే విధానం
ఉలవల్ని 6 గంటల పాటు నానబెట్టి తగినంత నీరు, కొద్దిగా ఉప్పు చేర్చి కుక్కర్లో 5 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత నీరు వడకట్టాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, ఉల్లితరుగు, జీలకర్ర, కారం, పసుపు కలిపి బరకగా దంచుకోవాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేగించి కొబ్బరి మిశ్రమం కలపాలి. రెండు నిమిషాల తర్వాత ఉడికించిన ఉలవలతో పాటు కొద్దిగా వడకట్టిన నీరు చల్లి చిన్నమంటపై మూత పెట్టి మగ్గించాలి. నీరు ఆవిరై ఉలవలు పొడి పొడిగా అయ్యాక దించేయాలి.

Advertisement

ఈ రోజు స్పెషల్ వంటకం
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.