బచ్చలి ముద్దకూర
కావలసిన పదార్థాలు
బచ్చలి తరుగు - రెండు కప్పులు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు + జీలకర్ర - ఒక స్పూను, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు - ఒక టేబుల్‌ స్పూను చొప్పున, పసుపు - అర టీ స్పూను, టమోటా ముక్కలు - అర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, ఇంగువ - చిటికెడు, కారం - ఒక టీ స్పూను, (ఉడికించిన) పెసరపప్పు - 1 కప్పు, ధనియాల పొడి - అర టీ స్పూను, కొత్తిమీర - ఒక కట్ట.
 
తయారుచేసే విధానం
బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, ఇంగువ వేయాలి. 2 నిమిషాల తర్వాత బచ్చలి తరుగు, పసుపు వేసి మూత పెట్టాలి. ఆకు మగ్గిన తర్వాత టమోటా ముక్కలు, ఉప్పు, కారం వేయాలి. టమోటా ముక్కలు మెత్తబడ్డాక ఉడికించిన పెసరపప్పు, ధనియాల పొడి కలపాలి. మరో 3 నిమిషాలు స్టౌ మీదనే ఉంచి దించేముందు కొత్తిమీర తరుగు చల్లాలి.
ఈ రోజు స్పెషల్ వంటకం
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.