మునగాకు వేపుడు కూర
కావలసిన పదార్థాలు
 
మునగాకు - 4 కప్పులు, బద్ద మినప్పప్పు - పావు కప్పు, పచ్చికొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు, నూనె - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా. తాలింపు కోసం : నూనె - 2 టీ స్పూన్లు, ఆవాలు - ఒక టీ స్పూను, ఎండుమిర్చి - 5, పసుపు - చిటికెడు.
 
తయారుచేసే విధానం
 
నూనెలో దోరగా వేగించిన మినప్పప్పుని కప్పు నీటిలో అరగంట పాటు నానబెట్టాలి. మునగాకును సన్నగా తరగాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, చిదిమిన ఎండుమిర్చి, పసుపు, మునగాకు తరుగు, వడకట్టిన మినప్పప్పు, ఉప్పు ఒకటి తర్వాత ఒకటి వేయాలి. తర్వాత కొద్ది నీరు చిలకరించి ఆకులు మెత్తబడేవరకు మూతపెట్టి సన్నటి మంటపై మగ్గించాలి. దించేముందు కొబ్బరి తురుము చల్లాలి. ఈ వేపుడు అన్నంతో బాగుంటుంది.
ఈ రోజు స్పెషల్ వంటకం
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.