రాగి ఇడ్లీ
కావలసిన పదార్థాలు: మినపప్పు-1/2 కప్పు (ఈ పప్పును రెండు లేదా మూడు గంటలు నీటిలో నాననివ్వాలి), ఇడ్లీ రవ్వ- 1కప్పు, రాగి పిండి-1 కప్పు, ఉప్పు- 1/2 టీస్పూను, వంటసోడ-చిటికెడు.
 
తయారీ: రెండు మూడు గంటల పాటు మినపప్పును నానబెట్టాలి. తర్వాత బాగా కడిగి పిండిలా రుబ్బుకోవాలి. అలాగే ఇడ్లీ రవ్వను కూడా ఒక గంటపాటు నాననిచ్చి బాగా కడగాలి. నీటిలో నానబెట్టిన రవ్వను రుబ్బిపెట్టుకున్న మినప్పిండిలో కలపాలి. ఆ పిండిలోనే రాగిపిండిని కూడా వేసి బాగా కలపాలి. ఆ పిండిని ఒక రాత్రంతా గిన్నెలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిండి బాగా ఊరుతుంది. ఆ పిండిలో ఉప్పు, చిటికెడు సోడా బై కార్బొనేట్‌ వేసి బాగా కలపాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి అందులో ఈ పిండి ఒక్కొక్క కప్పు వేసి కుక్కర్‌లో పెట్టి పది పన్నెండు నిమిషాల పాటు స్టవ్‌ మీద ఆవిరితో ఉడకనివ్వాలి. ఈ ఇడ్లీలను సాంబారు లేదా మీకు నచ్చిన చెట్నీతో వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
ఈ రోజు స్పెషల్ వంటకం
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.