జొన్నల దోసె
కావలసిన పదార్థాలు: జొన్నపిండి- 1 1/2కప్పు, బియ్యప్పిండి- 1/2 కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు- 1/2 కప్పు, జీలకర్ర- 1 టీస్పూను, కరివేపాకురెమ్మలు- రెండు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు-2, కొత్తిమీరఆకులు- కొన్ని(సన్నగా తరిగినవి), ఉప్పు-తగినంత.
 
తయారీ: జొన్నపిండి, బియ్యప్పిండి, ఉప్పులను కలిపి నీటితో మెత్తగా దోసెల పిండిలా చేసుకోవాలి. ఈ క్రమంలో పిండి గడ్డకట్టకుండా చూడాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. సాధారణ దోసె పిండి కన్నా జొన్నల దోసె పిండి కాస్త పలచగా చేసుకోవాలి. జోన్నల దోసె పిండి రెడీ చేసుకున్నాక తావాను పొయ్య మీద సన్నని మంటపై వేడి చేయాలి. వేడెక్కిన తావా మీద సెంటర్‌లో జొన్న పిండిని అట్టులా వేయాలి. తర్వాత అట్టు చుట్టూతా ఆయిల్‌ వేసి దాని మీద మూతపెట్టి కొద్దిసేపు అలాగే ఉంచాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకు కూడా తిప్పి జొన్న దోసెను ఒక నిమిషం పాటు కాల్చాలి. ఆ తర్వాత జొన్న దోసెను తావా మీద నుంచి తీసేయాలి. ఇలా మొత్తం పిండితో దోసెలు వేసుకుని టొమాటో చెట్నీ లేదా రసంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. జొన్నల దోసె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో పోషకవిలువలనిచ్చే ఎన్నో విటమిన్లు ఉన్నాయి.
ఈ రోజు స్పెషల్ వంటకం