కొర్రల ఉప్మా
కావాలసిన పదార్థాలు: కొర్రలు-1కప్పు, మీడియం సైజులోని ఉల్లిపాయ-1 (సన్నగా తరగి), పచ్చిమిరపకాయలు- మూడు (సన్నగా తరిగినవి), టొమాటోలు-2 (సన్నటిముక్కలుగా తరగాలి), జీడిపలుకులు-10.
 
తయారీ: బాండిలో రెండు స్పూన్ల నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో కొర్రలను వేసి సన్నని మంటపై రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత కుక్కర్‌లో రెండు స్పూన్ల నూనె వేసి ఆవాలు, అర టేబుల్‌స్పూను జీలకర్ర, అరటేబుల్‌స్పూను మినపప్పు, ఐదారు కరివేపాకులు, ఎర్రమిరపకాయలు రెండు మూడు, జీడిపప్పు పలుకులు వేసి బంగారువర్ణం వచ్చేవరకూ వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా కలపాలి. తరిగిపెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా అందులో వేసి అవి కాస్త వేగినట్టు అయిన తర్వాత రెండు కప్పుల నీళ్లు అందులో పోసి మరగనివ్వాలి. అవి ఉడకడం మొదలెట్టిన తర్వాత కొర్రలు, ఉప్పు వేయాలి. తర్వాత కుక్కర్‌పాత్రపై మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలపాటు స్టవ్‌ మీద ఉంచి కిందకు దించాలి. దీన్ని జీడిపప్పులు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి నిమ్మరసం పిండుకుని వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.
ఈ రోజు స్పెషల్ వంటకం