చిలగడదుంప వడలు
కావలసిన పదార్థాలు
 
చిలగడ దుంపలు - 300 గ్రా., ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - 3, అల్లం వెల్లుల్లి పేస్టు - పావు టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, పసుపు - పావు టీ స్పూను, కార్న్‌ఫ్లోర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, బియ్యప్పిండి - 1 టీ స్పూను, గరం మసాల - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేగించడానికి సరిపడా.
 
తయారుచేసే విధానం
 
చిలగడ దుంపల్ని మెత్తగా ఉడికించి చల్లారిన తర్వాత తొక్క తీసి మెదపాలి. ఈ గుజ్జులో ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్‌, ఉప్పు వేసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత దుంపల మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వడల్లా ఒత్తి నూనెలో దోరగా వేగించుకోవాలి. సాయంత్రం స్నాక్స్‌గా టీతో పాటు తింటే బాగుంటాయి.
ఈ రోజు స్పెషల్ వంటకం