కార్న్‌ కబాబ్స్‌
కావలసినవి: ఉడకబెట్టిన మొక్కజొన్నలు- 1 కప్పు, ఉడకబెట్టి మెత్తగా చేసిన బంగాళాదుంప, ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగి), పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్ట్‌ - 2 టీస్పూన్లు, బ్రెడ్‌ - 2 స్లయిస్‌లు, పసుపు- చిటికెడు, కొత్తిమీర తరుగు - కొద్దిగా, గరం మసాలా - 1 టీ స్పూన్‌, ఆమ్‌చూర్‌- అర టీ స్పూన్‌, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం: పెద్ద పాన్‌ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌, పచ్చిమిర్చి అందులో వేసి దోరగా వేగించాలి. ఆ తర్వాత ఉడకబెట్టిన మొక్కజొన్నలు ఆ పాన్‌లో వేసి కాస్త మెత్తగా చేయాలి. రెడీగా పెట్టుకున్న బ్రెడ్‌ స్లయిస్‌లను కొద్దిసేపు నీటిలో నానబెట్టాలి. ఒక గిన్నె తీసుకుని అందులో మెత్తగా చేసిన బంగాళాదుంప, నీటిలో నానబెట్టిన బ్రెడ్‌ ముక్కలు, ఉప్పు వేయాలి. ఇందులో చిటికెడు గరం మసాలా, కొద్దిగా ఆమ్‌చూర్‌ పొడి వేయాలి. ఈ మిశ్రమాన్ని పిండి ముద్దలా కలుపుకోవాలి. దీనిని 10-15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత పిండి ముద్దను బయటకు తీసి మీకు నచ్చిన ఆకారంలో అంటే పొడుగ్గా లేదా గుండ్రంగా చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌ మీద మరో పాన్‌ పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో వీటిని వేగించాలి. అలా వేడి వేడిగా తయారైన కార్న్‌ కబాబ్స్‌ను గ్రీన్‌ చట్నీతో, సాస్‌తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
ఈ రోజు స్పెషల్ వంటకం