కీర ప్యాన్‌కేక్స్‌
కావలసినవి: తురిమిన కీర- ముప్పావు కప్పు, బియ్యప్పిండి- అర కప్పు, సన్నగా తరిగిన పాలకూర- 2 టేబుల్‌ స్పూన్లు, పెరుగు-2 టేబుల్‌ స్పూన్లు, కారం- అర టీస్పూను, చిటికెడు పసుపు, నూనె- 2 టీస్పూన్లు, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం: తురిమిన కీరలో ఉప్పు కలిపి పదినిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కీరలోని నీళ్లను పిండేయాలి. అందులో బియ్యం పిండి, పాలకూర, పెరుగు, కారం, పసుపులను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో నీళ్లను కలిపి పిండిని కాస్త పలుచగా చేసుకోవాలి. తర్వాత చిన్న సైజు నాన్‌స్టిక్‌ పాన్‌లో అర టీస్పూను నూనె రాసి స్టవ్‌ మీద వేడిచేయాలి. అలా వేడెక్కిన పాన్‌పై చిన్న సైజు దోసెల్లాగా గరిటెడు పిండిని వేసి.. అరటీస్పూను నూనెతో రెండు వైపులా వేగనివ్వాలి. ఇదే తరహాలో మిగిలిన పిండితో దోసెల్లా వేసి గ్రీన్‌ చట్నీతో వేడి వేడిగా తింటే సూపర్‌గా ఉంటుంది.
ఈ రోజు స్పెషల్ వంటకం