బ్రొకోలి పకోడి
కావలసిన పదార్థాలు
బ్రొకోలి కాడలు - 200 గ్రా., శనగపిండి - 1 కప్పు, ఉప్పు - రుచికి సరిపడా, ధనియాల పొడి, కారం, పసుపు, జీరా పొడి, గరం మసాల - అర టీ స్పూను చొప్పున, ఆమ్‌చూర్‌, వెల్లుల్లి పొడి - పావు టీ స్పూను చొప్పున, నూనె - వేగించడానికి సరిపడా.
 
తయారుచేసే విధానం
ఒక లోతైన వెడల్పాటి పాత్రలో నూనె, బ్రొకోలి కాడలు తప్పించి మిగతా పదార్థాలన్నీ వేసి నీరు పోసి జారుగా కలుపుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక్కో బ్రొకోలి కాడను మిశ్రమంలో ముంచి పకోడీలు వేసి దోరగా వేగించాలి. ఈ పకోడీలు టమోటా సాస్‌తో వేడివేడిగా తింటే
బాగుంటాయి.
ఈ రోజు స్పెషల్ వంటకం