కాలీ ఫ్లవర్ చపాతీ
కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్‌ ముక్కలు- ఒక కప్పు, గుడ్లు- 2, వాము- చిటికెడు, కారం- అర టీస్పూను, మిరియాల పొడి- చిటికెడు, నూనె- కొద్దిగా, ఉప్పు- తగినంత.

తయారీ విధానం

కాలీఫ్లవర్‌ ముక్కలను ఉడికించుకుని వడపోసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక పల్చటి వస్త్రంలో వేసి నీళ్లు మొత్తం పోయేదాకా వేలాడదీయాలి. దానిలో మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలుపుకుని ఆ పిండితో చపాతీల్లా చేసుకుని పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
ఈ రోజు స్పెషల్ వంటకం
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.