కాలీ ఫ్లవర్ వడ
కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్‌ ముక్కలు- ఒక కప్పు, బియ్యప్పిండి- 2 టేబుల్‌స్పూన్లు, గుడ్డు- 1, తరిగిన ఉల్లికాడలు- అర కప్పు, వెన్న- 2 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ- 1, వెలుల్లి ముద్ద- అర టీస్పూను, కొత్తిమీర- కొద్దిగా, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
కాలీఫ్లవర్‌ ముక్కలను కడిగి బరకగా రుబ్బుకోవాలి. తర్వాత నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలిపి 5 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత బాణలిలో నూనె పోసి వేడెక్కాక వడలు వేసుకోవాలి.
ఈ రోజు స్పెషల్ వంటకం