ఖమ్మం జిల్లాలో రేపు అన్ని మండల కేంద్రాల్లో మిర్చి రైతులకు మద్దతుగా ఆందోళనలు: తమ్మినేని వీరభద్రం     |     తెలంగాణ బీఏసీ సమావేశం, భూసేకరణ బిల్లు సవరణల కోసం రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం      |     తూ.గో: తునిలో ఈదురు గాలులతో కూడిన వర్షం     |     శ్రీశైలంలో వడగళ్లవాన     |     యాదాద్రి భువనగిరి: దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతులకు రాయితీలు ఇస్తున్నాం: మంత్రి పోచారం      |     గుంటూరు: ఈపూరు మండలం ఉప్పాళ్లలో విషాదం, బావిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి     |     ఈ ఏడాది మిర్చి దిగుబడి పెరిగింది, మిర్చి పంటకు గిట్టుబాటు ధర కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం- తుమ్మల     |     వాల్‌మార్ట్- తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎంవోయూ, పాల్గొన్న మంత్రి కేటీఆర్, వాల్ మార్ట్ ప్రతినిధులు      |     విద్యాసాగర్‌రావు మృతికి ఎల్ రమణ, రేవంత్ సంతాపం     |     సీఎల్పీ కార్యాలయంలో జానారెడ్డిని కలిసిన బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి     
పాలక్‌ టోఫు కర్రీ
కావలసిన పదార్థాలు
టోఫు - 250గ్రా, పాలకూర - 200గ్రా, ఉల్లిపాయ - ఒకటి, టొమాటొ ప్యూరీ - 2 టేబుల్‌స్పూన్‌లు, నూనె - 2 టీస్పూన్‌లు, వెలుల్లి రెబ్బలు - మూడు, అల్లం - చిన్న ముక్క, కొబ్బరి పాలు - 300 గ్రా, జీలకర్ర - అర స్పూన్‌, ధనియాలు - అర స్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ఉప్పు, మిరియాలు - రుచికి తగినంత.
 
తయారీ విధానం
టోఫును చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టాలి. ఉల్లిపాయను సన్నగా తరగాలి. వెల్లుల్లిరెబ్బలు, అల్లం ముక్కలు దంచాలి.
ఒక పాత్రలో నూనె వేడి చేసి జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయలు వేసి వేగించాలి.
తరువాత అల్లం, వెల్లుల్లి వేసి మరో రెండు నిమిషాలు వేగించాలి. ఉప్పు, మిరియాలు, కారం వేసి బాగా కలపాలి.
టొమాటొ ప్యూరీ, పాలకూరను వేసి కాసేపు ఉడికించాలి. తరువాత కొబ్బరిపాలు పోసి మరో రెండు, మూడు నిమిషాలు ఉంచి స్టవ్‌ మీద నుంచి గిన్నె దించేయాలి.
మిశ్రమం చల్లారాక మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌చేయాలి.
స్టవ్‌ మీద పాన్‌ వేడి చేశాక మెత్తగా పట్టిన మిశ్రమాన్ని వేసి సన్నటి మంటమీద ఉడికించాలి. ఉడికేటప్పుడే టోఫు ముక్కలను వేసి మూడు నుంచి ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్‌ ఆపేయాలి. వేడిగా ఉంటే తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది పోషకాల ఈ ఆహారం.
బరువు పెరగకుండా, పోషకాలు అందేలా ఆహారాన్ని తినాలి. అటువంటి పోషకాలను అందించే వంటల్లో ఇది ఒకటి.
ఈ రోజు స్పెషల్ వంటకం