మహబూబాబాద్: తొర్రూర్‌ సమీపంలో లారీ- కారు ఢీ, ముగ్గురు మృతి     |     విశాఖ: కసింకోట మం. పరవాడపాలెం దగ్గర ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో మంటలు, ప్రయాణికులు క్షేమం, పూర్తిగా దగ్ధమైన బస్సు     |     వికారాబాద్‌: తాండూరులో టీడీపీ ప్రజాపోరు సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి      |     హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో తప్పుడు బిల్లులతో రూ.కోటి స్వాహా చేసిన ముఠా అరెస్ట్     |     సికింద్రాబాద్‌: రైల్వేస్టేషన్‌లో కోటి విలువచేసే కొకైన్‌ పట్టివేత, ఒకరు అరెస్ట్‌      |     అనంతపురం: విడపనకల్లు మండలం హావలిగిలో నీటికుంటలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి     |     అనంతపురం: గుంతకల్లు మండలంలో విషాదం, వైటీచెరువులో తిరగబడిన తెప్ప, 11 మంది మృతి     |     హైదరాబాద్‌లో ముగిసిన ఓయూ శతాబ్ది ఉత్సవాలు     |     13 మంది తృణమూల్ కాంగ్రెస్‌ నేతలపై ఈడీ కేసులు     |     ప.గో: అగ్రిగోల్డ్ చైర్మన్ సోదరులు అవ్వా ఉదయ్‌కుమార్, మణిశంకర్‌కు రిమాండ్ విధించిన ఏలూరు కోర్టు     
దాలియా కిచిడీ అండ్‌ కర్డ్‌
కావలసిన పదార్థాలు
గోధుమరవ్వ - ఒకటిన్నర కప్పు, పెసరపప్పు - ఒక కప్పు, నాలుగైదు రకాల కూరగాయలు - అరకేజీ, ఆవాలు, జీలకర్ర - ఒక్కో టీస్పూన్‌ చొప్పున, ఇంగువ - చిటికెడు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - మూడు, అల్లం - చిన్న ముక్క, వెలుల్లి రెబ్బలు - ఆరు, కారం, పసుపు, ధనియాల పొడి - ఒక్కో టీస్పూన్‌ చొప్పున, నెయ్యి - రెండు టీస్పూన్‌లు, నీళ్లు - తొమ్మిది కప్పులు, కొత్తిమీర - ఒక కట్ట.
 
తయారీ విధానం
కూరగాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లంలను సన్నగా తరగాలి.
కుక్కర్‌లో నెయ్యి వేడి చేశాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం తరుగుతో పాటు వెల్లుల్లి రెబ్బలు వేయాలి.
ఉల్లిపాయలు వేగాక కారం, పసుపు, ధనియాల పొడి వేసి సన్నటి మంట మీద ఒక నిమిషం ఉంచాలి.
తరువాత తరిగిన కూరగాయలు, గోధుమరవ్వ, పెసరపప్పు వేసి, నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి కుక్కర్‌ మూత పెట్టాలి.
మొదటి విజిల్‌ వచ్చేంత వరకు స్టవ్‌ మంట ఎక్కువగా పెట్టాలి. తరువాత తగ్గించి ఐదు నుంచి ఆరు విజిల్స్‌ వచ్చే వరకు ఉంచి దింపాలి.
కొత్తిమీర, నెయ్యిలతో అలంకరించి వేడి వేడిగా తింటే యమ్మీగా ఉంటుంది.
ఈ రోజు స్పెషల్ వంటకం