చిట్టిబాబుకే సాధ్యం అంటున్న రామలక్ష్మి
రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాకి సంబంధించి తాజాగా సమంతపై ప్రత్యేకంగా ఓ టీజర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు రామ్ చరణ్‌ని చిట్టిబాబుగా పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది. అదే దారిలో రామలక్ష్మిగా సమంత పాత్రను రివీల్ చేస్తూ విడుదల చేసిన టీజర్ కూడా సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుంది.
 
అయితే ఈ టీజర్‌ని తనపై ప్రత్యేకంగా విడుదల చేయడానికి కారణం రామ్ చరణే అని చెబుతూ.. తాజాగా సమంత తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది.
 
‘‘ప్రత్యేకంగా హీరోయిన్‌పై ఈవిధంగా టీజర్‌ని విడుదల చేయడం మాములు విషయం కాదు. ఇది సామాన్యంగా జరిగింది అనుకోవడం లేదు. సుకుమార్‌తో కలిసి చరణ్‌ ఒత్తిడి చేయడం వల్లే ఇది జరిగిందనే విషయం నాకు తెలుసు. ఇది ఒక అందమైన ఆరంభంగా నేను భావిస్తున్నాను. ఇందుకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను‌’’ అని సమంత ట్వీటారు.
Tags :Actress Samantha, rangasthalam, Ram charan, director sukumar, Mythri Movie Makers, Praises
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.