‘ఇంటిలిజెంట్’కి కత్తి రివ్యూ
కెరీర్ ప్రారంభంలో ‘పిల్లానువ్వులేని జీవితం’, ‘సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్’, ‘సుప్రీమ్’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను ద‌క్కించుకున్న సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌. అయితే ఈ యంగ్ హీరో న‌టించిన గ‌త నాలుగు చిత్రాలు ఇత‌నికి ప‌రాజ‌యాన్ని రుచి చూపించాయి. ఇలాంటి త‌రుణంలో క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల ద‌ర్శకుడిగా పేరున్న వి.వి.వినాయ‌క్ ద‌ర్శక‌త్వంలో సాయిధ‌ర‌మ్ సినిమా చేయ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి.
 
తాజాగా కత్తి మహేష్ ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ‘సినిమాలోని 5 పాటలూ సౌండ్ పొల్యూషన్‌కు కారణమవుతున్నాయి. ఉన్న ఒక్క రీమిక్స్ సాంగ్.. అసలైన పాత పాటని స్పాయిల్ చేస్తోంది. పెద్దగా ఆకట్టుకోని ఫైట్స్. నవ్వురాని కామెడి. లవ్ లేని రొమాంటిక్ ట్రాక్. పూర్తిగా అన్ ఇంటిలిజెంట్ స్టోరి. నువ్వు ఇంటెలిజెంట్‌వి అయితే, నేను ష్యూర్‌గా చెప్పగలను నువ్వు తెలివైన నిర్ణయం తీసుకుంటావు’ అంటూ కత్తి మహేష్ ఇంటిలిజెంట్ మూవీకి రివ్యూ ఇచ్చారు.
Tags :Mahesh Kathi, Sai dharam Tej
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.