ADVT
మావయ్యే ఎక్కువ సంతోషించారు
‘‘మనసుతో చేసిన సినిమా ‘మళ్లీ రావా’. ప్రేక్షకులూ మనసు పెట్టి చూశారు. మంచి విజయాన్ని అందించారు. చాలా హ్యాపీగా ఉంది. నాగార్జున మావయ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంకా సినిమాను చూడలేదు. కానీ, ప్రేక్షకుల స్పందన తెలుసుకుని అందరి కన్నా ఆయనే ఎక్కువ సంతోషించారు’’ అన్నారు సుమంత్‌. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘మళ్లీ రావా’ మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా సుమంత్‌ మాట్లాడుతూ ‘‘హిట్టూఫ్లాపులను సమానంగా స్వీకరించడం, ఒకేలా (బ్యాలెన్స్‌డ్‌గా) రియాక్ట్‌ కావడం ఎప్పుడో అలవాటు అయ్యింది. అయితే... అందరికీ సినిమా నచ్చడంతో సంతోషంగా ఉంది. ‘గౌరి’, ‘ధన 51’ వంటి మాస్‌ హిట్స్‌లో పాటు ‘సత్యం’, ‘గోదావరి’, ‘మళ్లీ రావా’ వంటి క్లాస్‌ హిట్స్‌ నా కెరీర్‌లో ఉన్నాయి. ఇకపై కూడా అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నా. ఇప్పుడు శ్రీనివాస్‌ అవసరాల అసోసియేట్‌ అనీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ‘మళ్లీ రావా’లో పాత్రతో పోలిస్తే కంప్లీట్‌ డిఫరెంట్‌ క్యారెక్టర్‌. యాంటీ-హీరో (నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌)గా చేస్తున్నా. అదొక థ్రిల్లర్‌ సిన్మా. 15 రోజులు షూటింగ్‌ చేశాం. త్వరలో కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది’’ అన్నారు.

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.