పద్మావతా? అలివేలు మంగమ్మా?
ఏడు కొండల శ్రీనివాసుడికి ఇద్దరు సతీమణులు ఉన్నారు. ఒకరు... పద్మావతీ దేవి. ఇంకొకరు... అలివేలు మంగమ్మ. నితిన్‌ హీరోగా సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న సినిమా ‘శ్రీనివాస కల్యాణం’. ఇందులోనూ హీరోకి జోడీగా ఇద్దరమ్మాయిలు నటిస్తున్నారు. ఇద్దరిలో ఒకరిగా ‘దువ్వాడ జగన్నాథమ్‌’ ఫేమ్‌ పూజా హెగ్డేని ఎంపిక చేసినట్టు సమాచారం. మరి, ఈ ‘శ్రీనివాస కల్యాణం’లో పూజ పాత్ర ఎలా ఉండబోతుందో?? ‘పద్మావతి దేవి’ తరహాలోనా... ‘అలివేలు మంగమ్మ’ తరహాలోనా... తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ మార్చిలో మొదలు కానుంది. జాతీయ పురస్కారం సాధించిన ‘శతమానం భవతి’ తర్వాత సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహించనున్న చిత్రమిది. ఇది కాకుండా ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో రెండు సినిమాలున్నాయి. రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’లో ప్రత్యేక గీతంలోనూ, బెల్లంకొండ ‘సాక్ష్యం’లో కథానాయికగానూ నటిస్తున్నారు.
సినిమా కబుర్లు
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.