మరోసారి పవన్‌ను టార్గెట్ చేసిన కత్తి మహేష్
వన్ కళ్యాణ్ అనే పేరు వింటే చాలు కత్తి మహేష్ కస్సుమంటున్నాడు. పవన్ కళ్యాణ్‌పై గతంలో ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు కత్తి. తాజాగా పవన్ అభిమానులు.. 'పవర్ స్టార్ కొడితే బ్లడ్ వస్తుంది. అదే పవర్ స్టార్ ఫ్యాన్స్ కొడితే బ్లడ్ తో పాటు భయం కూడా వస్తుంది..' అని అజ్ఞాతవాసి పోస్టర్ పై రాసి సోషల్ మీడియాలో ఉంచారు. ఈ పోస్టర్ చూసిన కత్తి మహేష్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. ట్విటర్ ద్వారా కత్తి దూశాడు.
 
'పవన్ కళ్యాణ్‌కి కూడా ఫ్యాన్స్ అంటే లఘుశంక. రేణుదేశాయ్‌ని బెదిరించినా, రౌడీ ముకల్లా ప్రవర్తించినా పల్లెత్తు మాట అనకుండా మూసుకుని కూర్చుంటాడు. ఏమన్నా అంటే, తేడా వస్తే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్‌కి కూడా బ్లడ్డు, భయము తెప్పిస్తారు' అంటూ కత్తి మహేశ్ ట్వీట్ చేశాడు.
Tags :katti mahesh, Pawan Kalyan, FIRE, tweets
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.