ADVT
ఈ సారి మరింత స్ట్రాంగ్ స్టోరీతో వస్తున్న 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ !
న మొదటి సినిమా 'అర్జున్ రెడ్డి' తోనే టాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టినంతా ఆకర్షించాడు ఆ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. చిన్న సినిమాగానే థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా సృష్టించిన కలెక్షన్ల సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీట్లో కూర్చొన్న ప్రేక్షకుడిని అట్టే కట్టిపడేస్తూ ఇండస్ట్రీనే షేక్ చేసిందీ సినిమా. ఓ వైపు వివాదాలు చుట్టుముడుతుంటే.. మరోవైపు మరింత జోష్ పెంచుతూ ఈ సినిమా చేసిన హంగామా అంతాఇంతా కాదు. విజయ్ దేవరకొండ క్యారెక్టరేషన్‌తో స్క్రీన్‌పై ఓ డిఫెరెంట్ పాత్రను పరిచయం చేసి వావ్ అనిపించుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. దీంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఈ దర్శకుడి పైనే పడింది. ఈయన తీయబోయే తదుపరి సినిమా ఏంటని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రత్యేకంగా యూత్ ఆడియన్స్.
 
అయితే ఈయన చేయబోయే రెండో సినిమా గురించి తాజాగా ఓ సమాచారం బయటకు వచ్చింది. 'షుగర్ ఫ్యాక్టరీ' అనే పేరుతో ఓ స్ట్రాంగ్ కథను సందీప్ రెడ్డి సిద్ధం చేశాడని తెలుస్తోంది. మునుపటి కంటే ఎక్కువ సంచలనాలు క్రియేట్ చేసేలా ఈ కథకు మెరుగులు దిద్దుతున్నాడని అంటున్నారు. క్రైం నేపథ్యంలో సాగే ఈ కథలోని కొన్ని సన్నివేశాలు రోమాలు నిక్కబొడిచేలా ఉండనున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ కథను ముగ్గురు హీరోలకు వినిపించాడని అందులో ఏ ఒక్కరు ముందుకొచ్చినా వెంటనే షూటింగ్ మొదలు పెట్టనున్నాడని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కాగా కొద్దిరోజుల్లోనే దీనికి సంబందించిన మరిన్ని వివరాలను క్లారిటీగా చెప్పేందుకు సందీప్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడని మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం తెలియాలంటే ఆ క్లారిటీ రావాల్సిందే.
Tags :arjun reddy, Director, Sandeep Reddy, next project

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.