ADVT
పవన్ కల్యాణ్ మాట అద్భుతం: పరుచూరి గోపాలకృష్ణ
ప్రస్తుతం జనంలోకి జనసేనాని పవన్ కల్యాణ్ వచ్చిన విషయం తెలిసిందే. వైజాగ్ నుండి పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనే పవన్ చెబుతున్న కొన్ని విషయాలపై ప్రత్యేకంగా వివరించారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. తన పరుచూరి పలుకులు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘జనంలోకి వచ్చిన జనసేనాని గురించి మాట్లాడుకుందాం.. ఎప్పుడూ చెబుతుంటాను నేను. నమస్కారం పెట్టే చేతులకంటే కన్నీళ్లు తుడిచే చూపుడు వేలు గొప్పదని. ఆ చూపుడు వేలు తనకి ఉందని ఒకటి కాదు.. మూడునాలుగు సార్లు నిరూపించుకున్నారు పవన్ కల్యాణ్ గారు. ముందు ఆ మనసుండాలి. ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి రాగలిగేటటువంటి అద్భుతమైన మనసుండాలి. ఆయన రాబట్టే సమస్య ప్రభుత్వం దృష్టిలో పడుతుంది. డీసీఏలో ఉద్యోగాలు పోగొట్టుకున్న కార్మికులందరికీ న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నా. ఆయన అభిమానులను ఉద్ధేశించి మాట్లాడుతూ.. మంచి మాటలు చెప్పారు. వాటి మీద స్పందించాలనిపించింది నాకు.
 
మొట్టమొదట ఆయన ఏమన్నారంటే.. భారతదేశంలో ఉన్న ఖనిజ సంపద కంటే కూడా నిజమైన సంపద యువత యొక్క ఆలోచనలో ఉంది అనేది చాలా అద్భుతమైన మాట. ఇది నిజం. ఈ మాట నెహ్రూగారు ఎప్పుడో చెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులు అని ఆయన చెప్పారు. అంటే ఈ రోజు నీవు ఎలా ఎదుగుతున్నావో.. అదే విధంగా పౌరుడిగా ఎదుగుతున్నావు. అలా పౌరుడిగా ఎదిగినటువంటి నీవు.. నీ బాధ్యతని విమర్శిస్తే, మరిచిపోతే.. అప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ దెబ్బతింటుంది. ఇది అర్ధం చేసుకోవాలి. అది పవన్ కల్యాణ్ గారు అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే ఇవాళ ఎక్కువగా మార్పు రావాల్సింది యువతలో.. అనే పాయింట్‌ని పవన్ కల్యాణ్‌గారు పట్టుకున్నారు.
 
యువత పరిస్థితి ఏంటో చూస్తూనే ఉన్నాం. నాకు తెలిసి యువత అంతా పడమటి గాలి వైపు కొట్టుకుపోతోంది. దయచేసి అలా వెళ్లవద్దు. ఆ గాలివైపు కనుక మీరు వెళ్లిపోతే.. మన దేశ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. యువతీ యువకులు వాళ్లు వారి దేశాన్ని కాపాడు కోవడానికి కర్తవ్యం ఏమిటి.. అనేది ఎప్పుడు ఆలోచిస్తారో.. అప్పుడు దేశం గురించి ఇంకెవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాలాంటి వాళ్లందరం పడమటి దిక్కువైపుకి వెళ్లిపోయాం. ఒకప్పుడు మేము కూడా ఉదయించిన సూర్యులమే. ‘కనురెప్ప క్రిందకు దిగితే వినయం. పైకి లేస్తే విప్లవం. రెప్పపాటు ధోరణిలో దోపిడీ జరిగిపోతోంది...’ అని ప్రపంచానికి చెప్పినవాళ్లమే. అందుకే చెబుతుంది.. మీ వయసు ఇప్పుడే ఉదయిస్తుంది. కాబట్టి మీకోసం ఆయన చెప్పిన ఈ మాట అద్భుతంగా నచ్చింది. ఇది ప్రతి యువతీ యువకుడు తన హృదయంలో పెట్టుకోవాలి...’’ అంటూ యువతకి పవన్ ఇచ్చిన పిలుపుపై పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.
Tags :paruchuri gopalakrishna, Paruchuri Palukulu, Pawan Kalyan, Youth

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.