రంగస్థలం ఇంకా కన్ఫ్యూజనే..
రామ్ చరణ్ హీరోగా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘రంగస్థలం 1985’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్ బయటకు రాలేదు. ఏవో షూటింగ్‌లో తీసిన సెల్ ఫోన్ ఫొటోలు తప్ప.. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన సరైన ఫొటో ఒక్కటి కూడా రాలేదు. ఈ సినిమా కోసం, చెర్రీ ఫస్ట్ లుక్ కోసం మెగాభిమానులు ఎదురు చూస్తున్నారనే విషయం తెలిసిందే.
 
అయితే చిత్రబ‌ృందం ఫస్ట్‌లుక్ రిలీజ్ అంటూ తాజాగా డేట్‌ని ప్రకటించింది. ఈ నెల 8న సాయంత్రం 5:30 గంటలకు సినిమా ఫస్ట్‌లుక్ విడుదల అంటూ ప్రకటించిన కాసేపటికే ఆ డేట్‌కి ఫస్ట్ ‌లుక్ రావడం లేదంటూ మరో ప్రకటనని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ముందు చెప్పిన డేట్‌కి కాకుండా ఒక రోజు ఆలస్యంగా అంటే డిసెంబర్ 9న ఉదయం 9గంటలకు ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో క్లారిటీ లేక ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతుంటే.. ఇలా ఫస్ట్ లుక్ రిలీజ్ విషయంలో కూడా యూనిట్ ఇలా కన్ఫ్యూజ్ అవుతుండటం విశేషం. సుకుమార్ డైరెక్షన్‌లో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. చెర్రీ సరసన సమంత నటిస్తోంది. చెర్రీ, సమంతలు ఇంతకు ముందు ఏ సినిమాలోనూ కనిపించని లుక్‌తో ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. జనవరి, 2018 మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Tags :Ram charan, rangastalam 1985, Sukumar, First Look, Release Date, Samantha
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.