నోకియా ఎక్స్ వచ్చేసింది

Published at: 11-03-2014 00:49 AM

న్యూఢిల్లీ : ఆండ్రాయిడ్ ఓపెన్ ఫ్లాట్‌ఫామ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ ' నోకియా ఎక్స్'ను తెస్తున్నట్టు ఎంతో కాలంగా ఊరిస్తున్న నోకియా ఎట్టకేలకు సోమవారం దానిని విడుదల చేసింది. ఈ ఫోన్ ధర 8,599 రూపాయలుగా ఉంది. స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో పోటీని తట్టుకునే వ్యూహంలో భాగంగా నోకియా ఎక్స్ సీరిస్‌లో చవక స్మార్ట్‌ఫోన్లను తీసుకురావాలని కంపెనీ సంకల్పించింది. ఇందు లో భాగంగానే తొలి ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మరో 60 రోజుల్లో నోకియా ఎక్స్ ప్లస్, ఎక్స్ఎల్‌ను కూడా భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఎక్స్ ప్లస్ ధర 8,400 రూపాయలు, ఎక్స్ఎల్ ధర 9,200 రూపాయలు ఉండవచ్చని తెలుస్తోంది. నోకియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పి బాలాజీ నోకియా ఎక్స్ ఫోన్లను ఆయన ఇక్కడ లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. నోకియా ఎక్స్ ఫీచర్లు : డ్యూయల్ సిమ్, 4 అంగుళాల స్క్రీన్, 1 గిగా హెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 512 ర్యామ్, 3 ఎంపి కెమెరా వంటి ఫీచర్లున్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌కు 6,000 కోట్లు

బెంగళూరు: దేశీయ ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ 6,000 కోట్ల రూపాయలకు (100 కోట్ల...

ఈక్విటీలదే గిరాకీ

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇప్పటివరకు భారత ఈక్విటీలు ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చితే మంచి...

Today's e-Paper